గజ ఈతగాళ్లకు అభినందన
Published Wed, Aug 17 2016 1:34 AM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM
పాన్‌గల్/వీపనగండ్ల: చెల్లపాడు ఘాట్‌లో మంగళవారం ఓ భక్తురాలు పుణ్యస్నానం చేస్తుండగా ఆమె పుస్తెల తాడుకు ఉన్న బంగారు తాళిబొట్టు బిళ్లలు నీటమునిగాయి. ఆందోళన చెందిన ఆమె, కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు గజ ఈతగాళ్లకు సమాచారం ఇచ్చారు. అరగంటపాటు శ్రమించిన ఈతగాళ్లు తాళిబొట్టుబిళ్లలను వెతికిపట్టుకున్నారు. తహసీల్దార్ ప్రభాకర్‌రావు ఈతగాళ్లను అభినందించారు. రూ.116 నగదును అందజేశారు. తన బొట్టుబిళ్లలు వెదికిచ్చినందుకు భక్తురాలు ఈతగాళ్లకు రూ.500 నగదు ఇచ్చారు.
Advertisement
Advertisement