సిడ్నీ :
సిడ్నీ స్కిన్నీ ఓషియన్ స్విమ్ ఐదో వార్షికోత్సవ సందర్భంగా ఆదివారం నూలు పోగులేకుండా స్విమ్మర్లు సముద్రతీరంలో సందడి చేశారు. ఆస్ట్రేలియాలో సిడ్నీలోని కోబ్లర్స్ బీచ్లో మొత్తం 1335 మంది స్విమ్మర్లు ఆడ, మగా తేడా లేకుండా ఒంటిపై నూలు పోగుకూడా లేకుండా సముద్రంలో ఈత కొట్టారు. ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ న్యూరోసర్జన్ చార్లీ టీయో, సర్ఫింగ్లో ప్రపంచ చాంపియన్ లేన్ బీచ్లేలు కూడా న్యూడ్గా ఈ ఈవెంట్లో పాల్గొన్నారు.
న్యూడ్గా బీచ్లోకి రావడంమే కాకుండా 300 నుంచి 900 మీటర్ల స్మిమ్మింగ్ పోటీల్లో వీరందరూ పాల్గొన్నారు. అయితే ఇవి స్విమ్మింగ్ రేసులు మాత్రం కాదని ఆర్గనైజర్లు తెలిపారు. ఆస్ట్రేలియన్ చారిటీల కోసం, మంచి పనులు చేయడానికి నిధులు సమకూర్చడానికి ఈ న్యూడ్ స్విమ్ ఈవెంట్ ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు.
'ప్రతి ఒక్కరూ ఎలాంటి ఇబ్బందిలేకుండా న్యూడ్గా నీళ్లలో సరదాగా దిగండి. న్యూడ్గా ఉండటం మాత్రమే ఈ ఈవెంట్ ప్రధాన అంశం కాదు. మిమ్మల్ని మీరు ప్రకృతితో మమేకమై సరదగా గడుపుతున్నామని భావించండి' అని ఈ కార్యక్రమానికి అంబాసిడర్గా వ్యవహరిస్తున్న బీచ్లే అన్నారు.
ఆడా, మగా తేడాలేకుండా న్యూడ్గా..
Published Sun, Mar 19 2017 12:52 PM | Last Updated on Tue, Sep 5 2017 6:31 AM
Advertisement
Advertisement