ముంబై: కరోనా కారణంగా అర్ధాంతరంగా వాయిదా పడిన ఐపీఎల్ 14వ సీజన్ రీషెడ్యూల్‌ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం ఐపీఎల్-14 ఫైజ్2 తేదీలను వెల్లడించింది. ఐపీఎల్ 14వ సీజన్ సెప్టెంబర్ 19 నుంచి పునఃప్రారంభం కానున్నట్లు తెలిపింది.
ఇప్పటికే ఐపీఎల్ 14వ సీజన్‌లో 29 మ్యాచ్‌లు పూర్తికాగా, మిగిలిన 31 మ్యాచ్‌లను యూఏఈ వేదికగా జరగనున్నాయి. మెదటి మ్యాచ్ ఢిపిండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. దీనికి సంబంధించి పూర్తి షెడ్యూలును బీసీసీఐ విడుదల చేసింది. నూతన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 10న మొదటి క్వాలిఫైయర్, అక్టోబర్ 11న ఎలిమినేటర్, అక్టోబర్ 13న రెండో క్వాలిఫైయర్, అక్టోబర్ 15న దుబాయి వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
BCCI announces schedule for remainder of VIVO IPL 2021 in UAE.
— IndianPremierLeague (@IPL) July 25, 2021
The 14th season, will resume on 19th September in Dubai with the final taking place on 15th October.
More details here - https://t.co/ljH4ZrfAAC #VIVOIPL
Comments
Please login to add a commentAdd a comment