
తన ఆట తీరుతోను కోట్లాది మంది క్రికెట్ ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్న ఘనత మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనికే దక్కుతుంది. అంతకముందు ధోని తన కూతురు జీవాతో కలిసి చేసే అల్లరిని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉండేవాడు. అయితే ఈ మధ్య ధోని సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించడం లేదు. లాక్ డౌన్ కారణంగా ఎక్కడివారక్కడ ఇంటికే పరిమితమయిన వేళ గత నాలుగైదు నెలలుగా అప్పుడప్పుడూ మాత్రమే ధోని ఫ్యాన్స్‌ను పలకరిస్తున్నాడు. తాజాగా ధోని శుక్రవారం నాడు ఒక వీడియోలో కనిపించాడు. ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ ..ధోని కనిపిస్తున్న ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.
చదవండి: ధోని అంటే తెలియని వారు ఉన్నారా?
ఈ వీడియోలో ధోని కాస్తంత కొత్తగా కనిపిస్తున్నాడు. ధోనీ వయసు తగ్గినట్లు కనిపిస్తోంది. ఈ వీడియోలో ఎవరితోనో వీడియో కాల్ మాట్లాడుతూ ధోని వారికి హాయ్ చెబుతున్నాడు. ఈ వీడియోలో ధోనిని చూసిన ఫ్యాన్స్, తిరిగి గ్రౌండ్‌లోకి దిగేందుకు సిద్ధమైపోయాడని కామెంట్లు పెడుతున్నారు. ఈ ఏడాది ఐపీఎల్ జరిగితే, ధోనిని క్రికెట్ మైదానంలో తిరిగి చూసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక ధోని ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాధన్ మాట్లాడుతూ, వచ్చే పది సంవత్సరాల పాటు ధోనినే చైన్నై సూపర్ కింగ్స్ బాస్ అని నా అభిప్రాయం అని పేర్కొన్నారు.
చదవండి: భారత అభిమానుల గుండె పగిలిన రోజు
The much needed pawsitivity at 7! #Thala @msdhoni #WhistlePodu 🦁💛 pic.twitter.com/fEVrG0Gubc
— Chennai Super Kings (@ChennaiIPL) July 17, 2020
Comments
Please login to add a commentAdd a comment