IPL 2022: RCB Fan Girl Holding Placard And Says "No Marriage Till RCB Win Trophy", Amit Mishra Tweet Goes Viral- Sakshi
Sakshi News home page

IPL 2022 CSK VS RCB: ఆర్సీబీ టైటిల్‌ నెగ్గే వరకు ఆ అమ్మడు పెళ్లి చేసుకోదట..!

Published Wed, Apr 13 2022 1:15 PM | Last Updated on Wed, Apr 13 2022 2:53 PM

IPL 2022 CSK VS RCB: Amit Mishra Tweet Gone Viral - Sakshi

Photo Courtesy: IPL

Amit Mishra Tweet: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో నిన్న(ఏప్రిల్‌ 12) జరిగిన హైస్కోరింగ్‌ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ అన్నీ రంగాల్లో రాణించి సీజన్‌ తొలి విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రాబిన్‌ ఉతప్ప (50 బంతుల్లో 88; 4 ఫోర్లు, 9 సిక్సర్లు), శివమ్‌ దూబే (46 బంతుల్లో 95; 5 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో సీఎస్‌కే నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఛేదనలో ఆర్సీబీ సైతం చివరిదాకా పోరాడినప్పటికీ ఫలితం అనుకూలంగా రాలేదు. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 193 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా సీఎస్‌కే 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. 


ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో కనిపించిన ఓ దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్‌ చేస్తుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్‌ టైటిల్‌ గెలిచేంతవరకు వరకూ పెళ్లి చేసుకోనంటూ ఓ అమ్మడు ప్లకార్డుతో కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫోటోను ఐపీఎల్‌ లీడింగ్‌ వికెట్‌టేకర్లలో ఒకరైన అమిత్‌ మిశ్రా తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేయగా నెట్టింట వైరలవుతోంది. ఈ అమ్మాయి తల్లిదండ్రుల పరిస్థితి తలచుకుంటే ఆందోళనగా ఉందంటూ క్యాప్షన్‌ జోడించిన ఈ ట్వీట్‌కు నెటిజన్ల నుంచి విపరీతమైన రెస్పాన్స్‌ వస్తుంది. భారీ స్థాయిలో ట్రోల్స్ పేలుతున్నాయి. మంగమ్మ శపథం చేయకు తల్లీ.. జీవితాంతం సింగిల్‌గానే మిగిలిపోగలవంటూ నెటిజన్లు ఆర్సీబీకి వ్యతిరేకంగా రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: ఐపీఎల్ 2022కు సంబంధించి కీలక అప్‌డేట్‌..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement