చెన్నై సూపర్ కింగ్స్ (ఫైల్ ఫొటో)
సాక్షి, హైదరాబాద్ : రెండేళ్ల నిషేదం తర్వాత పునరాగమనం చేస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్టుపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్ ప్రచారంలో భాగంగా సీఎస్‌కే ఫ్రాంచైజీ రూపోందించిన ఓ వీడియో ఇప్పుడు సచిన్ అభిమానులకు కోపం తెప్పిస్తోంది. దీంతో అప్రమత్తమైన సీఎస్‌కే జట్టు తమ అధికారిక ఫేస్‌బుక్ పేజీ నుంచి ఈ వీడియోను తొలగించింది. అయినప్పటికి తమ ఆరాధ్య దైవం, అభిమాన క్రికెటర్‌ను కించపరిచేలా సీఎస్‌కే వ్యవహరించిందని సచిన్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు.
ఆ వీడియోలో ఏముందంటే..
అభిమానులను ఆకట్టుకోవాడినికి తమిళ బాషలో రూపొందించిన ఈ వీడియో సచిన్ జెర్సీ కిందపడే సన్నివేశంతో మొదలవుతోంది. ఇదే అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. అనంతరం తమిళ నెటివిటికి తగ్గట్టు.. సూపర్ స్టార్ రజనీకాంత్ పోస్టర్లు, ఐపీఎల్ సమయంలో యువత గడిపే సన్నివేశాలతో ఈ వీడియోను రూపొందించారు. ప్రస్తుతం అభిమానులు ఈ వీడియోను ‘షేమ్ చెన్నై సూపర్ కింగ్స్’ అంటూ ట్రోల్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment