ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య నిన్న (ఏప్రిల్ 12) జరిగిన రసవత్తర మ్యాచ్.. వ్యూయర్షిప్ పరంగా రికార్డులను బద్ధలు కొట్టింది. ఈ మ్యాచ్ ప్రస్తుత సీజన్‌లో అత్యధిక వ్యూయర్షిప్ సాధించిన మ్యాచ్‌గా రికార్డుల్లోకెక్కింది. సీఎస్‌కే బ్యాటింగ్ ఆఖరి 5 ఓవర్ల సమయంలో ఈ మ్యాచ్‌ను హాట్‌స్టార్‌లో 8.2 మిలియన్ల ప్రేక్షకులు వీక్షించారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో ఇదే రికార్డు.
చెన్నై ఇన్నింగ్స్ సందర్భంగా రాబిన్ ఉతప్ప (50 బంతుల్లో 88; 4 ఫోర్లు, 9 సిక్సర్లు), శివమ్ దూబే (46 బంతుల్లో 95; 5 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగుతుండటంతో మ్యాచ్‌కు అమాంతం వ్యూయర్షిప్ పెరిగింది. ఆర్సీబీ ఇన్నింగ్స్ సమయంలో మ్యాక్స్‌వెల్ (26), షాబాజ్ అహ్మద్ (41), సుయాష్ ప్రభుదేశాయ్ (34), దినేష్ కార్తీక్ (34) పోరాటం చేస్తుండగా కూడా వీక్షకుల సంఖ్య పీక్స్‌కు చేరింది.
ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో నిన్న(ఏప్రిల్ 12) జరిగిన హైస్కోరింగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అన్నీ రంగాల్లో రాణించి సీజన్ తొలి విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రాబిన్ ఉతప్ప (50 బంతుల్లో 88; 4 ఫోర్లు, 9 సిక్సర్లు), శివమ్ దూబే (46 బంతుల్లో 95; 5 ఫోర్లు, 8 సిక్సర్లు) భారీ హాఫ్ సెంచరీలతో విరుచుకుపడటంతో సీఎస్‌కే నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో ఆర్సీబీ సైతం చివరిదాకా పోరాడినప్పటికీ ఫలితం అనుకూలంగా రాలేదు. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 193 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా సీఎస్‌కే 23 పరుగుల తేడాతో విజయం సాధించింది.
చదవండి: IPL 2022: రషీద్ ఖాన్ రేంజ్‌లో మేము లేము.. ఎస్‌ఆర్‌హెచ్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment