IPL 2022: సీఎస్‌కేకు మరో భారీ షాక్‌.. లీగ్‌ను వీడిన విదేశీ బ్యాటర్‌ | IPL 2022: CSK Batter Devon Conway Leaves IPL For His Wedding | Sakshi
Sakshi News home page

Devon Conway: సీఎస్‌కేకు మరో భారీ షాక్‌.. లీగ్‌ను వీడిన విదేశీ బ్యాటర్‌

Published Thu, Apr 21 2022 12:15 PM | Last Updated on Thu, Apr 21 2022 12:15 PM

IPL 2022: CSK Batter Devon Conway Leaves IPL For His Wedding - Sakshi

Photo Courtesy: IPL

Devon Conway Leaves IPL For His Wedding: ఓ పక్క వరుస ఓటములు మరో పక్క గాయాల బెడదతో సతమతవుతున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌కు మరో షాక్‌ తగిలింది. దక్షిణాఫ్రికాలో జరుగనున్న తన వివాహం కోసం ఆ జట్టు విదేశీ ఆటగాడు (న్యూజిలాండ్‌) డెవాన్‌ కాన్వే పాక్షికంగా లీగ్‌ను వీడాడు. ఇటీవలే భారతీయ సంప్రదాయ దుస్తుల్లో (తమిళ స్టైల్‌ పంచకట్టులో) ప్రీ వెడ్డింగ్‌ పార్టీ చేసుకున్న కాన్వే పెళ్లి తర్వాత ఏప్రిల్ 24న భార్యతో కలిసి తిరిగి భారత్‌కు వస్తాడని తెలుస్తోంది. సీఎస్‌కే వర్గాల సమాచారం మేరకు కాన్వే ముంబై ఇండియన్స్‌ (ఏప్రిల్‌ 21), పంజాబ్‌ కింగ్స్‌ (ఏప్రిల్‌ 25)తో జరిగే మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడం లేదు. 


కాన్వే ప్రీ వెడ్డింగ్‌ పార్టీలో సీఎస్‌కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, ప్రస్తుత, మాజీ కెప్టెన్లు, జడేజా, ధోని, ఇతర జట్టు సభ్యులు హుషారుగా పాల్గొన్న సంగతి తెలిసిందే. 2022 ఐపీఎల్‌ మెగా వేలంలో కాన్వేను సీఎస్‌కే కోటి రూపాయలకు సొంతం చేసుకుంది. డుప్లెసిస్‌ స్థానాన్ని భర్తీ చేస్తాడని సీఎస్‌కే అతనిపై భారీ అంచనాలు పెట్టుకుంది. అయితే ప్రస్తుత సీజన్‌లో అతనికి ఒకే మ్యాచ్‌ ఆడే అవకాశం లభించింది. ఇదిలా ఉంటే, ప్రస్తుత ఐపీఎల్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సీఎస్‌కే ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 5 పరాజయాలు ఒకే ఒక్క విజయాన్ని నమోదు చేసి, పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. గాయాల కారణంగా దీపక్‌ చాహర్‌, ఆడమ్‌ మిల్నే ఐపీఎల్‌ నుంచి పూర్తిగా వైదొలిగిన విషయం తెలిసిందే.


చదవండి: డెవాన్‌ కాన్వే ప్రీ వెడ్డింగ్‌ పార్టీ.. పంచ కట్టుతో రచ్చరచ్చ చేసిన సీఎస్‌కే ప్లేయర్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement