
చెన్నై: మహేంద్ర సింగ్ ధోని... భారత క్రికెట్ దిగ్గజాల్లో ఒకడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అతను తన తొలిప్రేమపై పెదవి విప్పాడు. తన బయోపిక్ ‘ధోని–ది అన్‌టోల్డ్ స్టోరీ’లో లేని ముచ్చటొకటి చెప్పాడు.
మెజీషియన్ సరదాగా ధోని తొలి ప్రేమ గురించి వివరించమన్నప్పుడు ఈ కహానీ వెలుగులోకి వచ్చింది. మొదట ఆమె పేరులో ‘ఎ’ అక్షరముంటుందన్నాడు. తర్వాత అది పేరులోని మూడో అక్షరమన్నాడు. చివరకు ‘ఆమె పేరు స్వాతి. కానీ నా భార్య (సాక్షి)కు మాత్రం చెప్పకండి. ప్లీజ్..’ అని నవ్వుతూ చెప్పేశాడు. దీనిపై ఇంకాస్త వివరణ ఇస్తూ... 1999లో తను 12వ తరగతి చదువుతుండగా తొలిప్రేమ చిగురించిందని చెప్పాడు. ఆ ఏడాది తర్వాత తననెప్పుడూ చూడలేదన్నాడు.