The Untold Story
-
చెప్పని కథ!
కరణ్ జీత్ కౌర్ వోహ్రా అంటే చాలా తక్కువమందికి తెలిసి ఉంటుంది. కానీ సన్నీ లియోన్ అంటే తెలియనివాళ్లు చాలా తక్కువమంది ఉంటారు. యస్.. ఇద్దరూ ఒకరే. సన్నీనే కరణ్ జీత్. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకు? అంటే సన్నీ లియోన్ లైఫ్ ఆధారంగా ‘కరణ్ జీత్ కౌర్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీ లియోన్’ అనే వెబ్ సీరిస్ రూపొందుతోంది. ఈ నెల 16న ఓ ఆంగ్ల చానెల్లో ఫస్ట్ ఎపిసోడ్ ప్రసారం కానుందట. యంగ్ సన్నీ రోల్ చేసిన రసా సౌజానీ మాట్లాడుతూ– ‘‘12–15 ఏజ్‌లో ఉన్న సన్నీ లియోన్ పాత్ర చేశాను. చాలెంజింగ్ రోల్‌గా ఫీలయ్యా. ఆమె జర్నీలో ఎమోషనల్ డెప్త్ ఉంది’’ అన్నారు. ప్రస్తుతం తమిళ దర్శకుడు వడివుడయాన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ‘వీరమహాదేవి’ సినిమాలో నటిస్తున్నారు సన్నీ లియోన్. హీరోయిన్గా ఆమె సౌత్‌లోకి ఎంట్రీ ఇస్తున్న తొలి సినిమా ఇదే. -
ఆమె పేరు స్వాతి.. సాక్షికి చెప్పొద్దు ప్లీజ్!
చెన్నై: మహేంద్ర సింగ్ ధోని... భారత క్రికెట్ దిగ్గజాల్లో ఒకడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అతను తన తొలిప్రేమపై పెదవి విప్పాడు. తన బయోపిక్ ‘ధోని–ది అన్‌టోల్డ్ స్టోరీ’లో లేని ముచ్చటొకటి చెప్పాడు. మెజీషియన్ సరదాగా ధోని తొలి ప్రేమ గురించి వివరించమన్నప్పుడు ఈ కహానీ వెలుగులోకి వచ్చింది. మొదట ఆమె పేరులో ‘ఎ’ అక్షరముంటుందన్నాడు. తర్వాత అది పేరులోని మూడో అక్షరమన్నాడు. చివరకు ‘ఆమె పేరు స్వాతి. కానీ నా భార్య (సాక్షి)కు మాత్రం చెప్పకండి. ప్లీజ్..’ అని నవ్వుతూ చెప్పేశాడు. దీనిపై ఇంకాస్త వివరణ ఇస్తూ... 1999లో తను 12వ తరగతి చదువుతుండగా తొలిప్రేమ చిగురించిందని చెప్పాడు. ఆ ఏడాది తర్వాత తననెప్పుడూ చూడలేదన్నాడు. -
రైనా పాత్రలో రాంచరణ్!
హీరో రాంచరణ్ బాలీవుడ్ లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. జంజీర్ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఈ మెగా వారసుడు రెండో చిత్రానికి సంతకం చేశారని చిత్రసీమ సమాచారం. క్రికెటర్ గా నటించేందుకు రాంచరణ్ అంగీకరించినట్టు తెలుస్తోంది. క్రికెటర్ సురేశ్ రైనా పాత్రను తెరపై చెర్రీ పోషించనున్నాడు. భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న'ఎంఎస్ ధోని- ది ఆన్ టోల్డ్ స్టోరీ' సినిమాలో ఈ పాత్ర చేయనున్నాడు. ధోని పాత్రలో సుశాంత్ సింగ్ రాజ్‌ఫుత్ నటిస్తున్నాడు. జడేజా పాత్రలో అమిత్ కుమార్, మైఖేల్ క్లార్క్ గా మహ్మద్ యూసఫ్ నటిస్తున్నారు. నీరజ్ పాండే దర్శకత్వం వహిస్తున్నారు. 2015లో ఈ సినిమా విడుదలకానుంది. -
‘ధోని’ సినిమా చూపిస్తున్నాడు!
- తెరపై భారత క్రికెట్ కెప్టెన్ బయోగ్రఫీ - ధోని పాత్ర పోషిస్తున్న సుశాంత్ రాజ్‌పుత్ ముంబై: క్రికెట్ ప్రపంచంలో సూపర్ స్టార్‌గా కొనసాగుతున్న భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జీవితం ఇప్పుడు సినిమాగా తెరకెక్కనుంది. సాధారణ కుటుంబ నేపథ్యంనుంచి వచ్చి భారత క్రికెట్ అత్యుత్తమ కెప్టెన్‌గా ఎదిగిన అతను ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాడు. ఈ నేపథ్యంలో అతని జీవితంలోని అనేక మలుపులు, విశేషాలతో ‘ఎం.ఎస్. ధోని - ది అన్‌టోల్డ్ స్టోరీ’ పేరుతో సినిమా రూపొందుతోంది. ధోని గురించి క్రికెట్ వీరాభిమానులకు కూడా తెలియని ఎన్నో విషయాలు ఈ చిత్రంలో చూపించనున్నారు. ‘ఎ వెడ్నస్ డే’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న నీరజ్ పాండే దీనికి దర్శకత్వం వహిస్తుండగా...‘కై పో చే’ చిత్రంలో వెలుగులోకి వచ్చిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ టైటిల్ పాత్ర పోషిస్తున్నాడు. ధోని నాయకత్వంలో భారత జట్టు టి20 ప్రపంచ కప్ గెలిచి సరిగ్గా ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ధోనికే చెందిన ఇన్స్పైర్డ్ ఎంటర్టైన్మెంట్- రితి స్పోర్ట్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. క్రీడాకారుల జీవిత చరిత్రతో ఇటీవల రూపొందించిన భాగ్ మిల్కా భాగ్, మేరీకోమ్ చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. వచ్చే ఏడాది ధోని సినిమా విడుదలవుతుంది. గతంలోనే ధోనిపై సినిమా నిర్మాణంలో ఉందని, అయితే బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేసిందని వార్తలు వచ్చాయి. అయితే దీనిని కొట్టిపారేసిన బోర్డు, ధోని ప్రొఫెషనల్ కెరీర్‌కు సమస్య రానంత వరకు అతని సినిమాపై తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేసింది.