‘భాయ్‌.. ఐపీఎల్‌ కప్‌లో టీ తాగించాలి’ | Virat Kohli And MS Dhoni Bromance Hug At RCB vs CSK Match is Winning The Internet | Sakshi
Sakshi News home page

‘భాయ్‌.. ఐపీఎల్‌ కప్‌లో టీ తాగించాలి’

Published Thu, Apr 26 2018 3:23 PM | Last Updated on Thu, Apr 26 2018 3:23 PM

Virat Kohli And  MS Dhoni Bromance Hug At RCB vs CSK Match is Winning The Internet - Sakshi

మ్యాచ్‌ సందర్భంగా ధోని, విరాట్‌ల ఆత్మీయ ఆలింగనం

రెండేళ్ల విరామం తర్వాత ఐపీఎల్‌లో పునరాగమనం చేసిన ధోని జట్టు ఈ సీజన్‌లో అదరగొడుతోంది. 6 మ్యాచ్‌లు ఆడిన చెన్నై జట్టు ఐదింటిలో గెలుపొంది పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. కాగా చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మధ్య బుధవారం జరిగిన మ్యాచ్‌లో ధోని సి​​క్సర్ల మోత మోగించి జట్టుకు విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. ధోని, కోహ్లిల జట్లు ఈ సీజన్‌లో తొలిసారి తలపడుతుండటంతో ఈ మ్యాచ్‌ను కెప్టెన్‌ కూల్‌, కెప్టెన్‌ అగ్రెసివ్‌ల మధ్య పోరుగా అభిమానులు అభివర్ణించారు.

అయితే ప్రస్తుతం మ్యాచ్‌ సందర్భంగా చోటుచేసుకున్న ఆసక్తికర సన్నివేశం గురించి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ధోని, విరాట్‌లు ఒకరినొకరు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న ఫొటో నెటిజన్లను ఆకర్షిస్తోంది. ‘చెన్నై- కర్ణాటక ఇప్పుడు స్నేహితులయ్యారు. కావేరీ జలాల సమస్య తీరిపోయింది ఇక’ అంటూ ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు. ‘మహీ భాయ్‌ ఐపీఎల్‌ కప్‌లో నాకు చాయ్‌ తాగించాలి ప్లీజ్‌’ అంటూ మరొకరు సరదాగా కోహ్లిని ఉద్దేశించి కామెంట్‌ చేశారు. ‘ఈ ఫొటో చాలా మాట్లాడుతోందంటూ’  ధోని, కోహ్లిల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement