Photo Credit: IPL Twitter
ఐపీఎల్-2023లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఇవాళ (ఏప్రిల్ 17) మరో రసవత్తరమైన మ్యాచ్ జరుగనుంది. ఫోర్ టైమ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. త్రీ టైమ్ ఫైనలిస్ట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపనుంది. ఈ మ్యాచ్‌లో క్రికెట్ దిగ్గజాలు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లిలు భారీ రికార్డులపై కన్నేశారు. కోహ్లి ఈ మ్యాచ్‌లో మరో 21 పరుగులు చేస్తే, శిఖర్ ధవన్ తర్వాత ఐపీఎల్‌లో చెన్నైపై 1000 పరుగులు పూర్తి చేసిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కుతాడు.
ఈ మ్యాచ్‌లో ధోని మరో 2 పరుగులు చేస్తే, ఆర్సీబీపై అత్యధిక పరుగులు (840) సాధించిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతానికి ఆర్సీబీపై అత్యధిక పరుగులు చేసిన రికార్డు డేవిడ్ వార్నర్ (839) పేరిట ఉంది.
కాగా, ప్రస్తుత ఎడిషన్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో చెన్నై, ఆర్సీబీ చెరి 4 మ్యాచ్‌ల్లో 2 విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో 6, 7 స్థానాల్లో నిలిచాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు లక్నో, గుజరాత్, పంజాబ్ జట్లతో సమానంగా 6 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలుస్తుంది. ప్రస్తుతానికి రాజస్థాన్ రాయల్స్ 5 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టిక అగ్రస్థానంలో కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment