Samantha Said Virat Kohli Is An Inspiration, I Almost Cried When He Made Comeback Hundred - Sakshi
Sakshi News home page

కోహ్లి సెంచరీ చేయగానే ఏడ్చేశా, అతడే నాకు స్ఫూర్తి: సమంత

Published Fri, May 12 2023 4:30 PM | Last Updated on Fri, May 12 2023 4:54 PM

Samantha Said Virat Kohli Is An Inspiration, I Almost Cried When He Made Comeback Hundred - Sakshi

ప్రముఖ టాలీవుడ్‌ నటి సమంత క్రికెట్‌కు సంబంధించి, తన ఇష్టా అయిష్టాలను ఇటీవలే స్టార్‌ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో షేర్‌ చేసుకున్నారు. స్టార్‌ హీరో విజయ్‌ దేవరకొండతో కలిసి ఈ ఇంటర్వ్యూకి హాజరైన సమంత.. టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి తనకు స్పూర్తి అని, భారత మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని తన ఫేవరెట్‌ క్రికెటర్‌ అని, ఐపీఎల్‌లో తనకు ఇష్టమైన జట్టు చెన్నై సూపర్‌ కింగ్స్‌ అని వెల్లడించారు.

ఈ సందర్భంగా సామ్‌.. విరాట్‌ కెరీర్‌కు సంబంధించిన ఓ కీలక ఘట్టాన్ని ప్రస్తావించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లి తన కమ్‌ బ్యాక్‌ సెంచరీ (71వ శతకం) చేసినప్పుడు ఏడ్చేశానని చెప్పుకొచ్చారు. ఫామ్‌ కోల్పోయి, ముప్పేట దాడిని ఎదుర్కొన్న కోహ్లి, తిరిగి పుంజుకున్న తీరు అమోఘమని.. ఇది నిజంగా స్ఫూర్తిదాయకమని అన్నారు. ఇవే కాక క్రికెట్‌కు సంబంధించిన మరిన్ని విశేషాలను సామ్‌ స్టార్‌ స్పోర్ట్స్‌తో పంచుకున్నారు.     

ఇదిలా ఉంటే, ప్రస్తుతం సమంత.. విజయ్‌ దేవరకొండతో కలిసి 'ఖుషి' సినిమాలో నటిస్తుంది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరోవైపు విరాట్‌ కోహ్లి, మహేంద్ర సింగ్‌ ధోనిలు ఐపీఎల్‌-2023లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ధోని సారధ్యం వహిస్తున్న సీఎస్‌కే.. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుండగా, కోహ్లి టీమ్‌ ఆర్సీబీ ఆరో స్థానంలో ఉంది. 12 మ్యాచ్‌ల్లో ఏడింట గెలిచిన సీఎస్‌కే ప్లే ఆఫ్స్‌ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకోగా.. 11 మ్యాచ్‌ల్లో 5 గెలిచిన ఆర్సీబీ, తాము ఆడాల్సిన మిగతా 3 మ్యాచ్‌ల్లో గెలిచి ప్లే ఆఫ్స్‌ రేసులో నిలవాలని భావిస్తుంది. 

చదవండి: తండ్రి కాబోతున్న మ్యాక్స్‌వెల్.. 'రెయిన్‌బో బేబీ' జన్మించబోతోందంటూ..
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement