రహానే అద్భుత విన్యాసం (Photo Credit: IPL/JIO Cinema Twitter)
IPL 2023- RCB Vs CSK: అజింక్య రహానే.. టీమిండియా వెటరన్ బ్యాటర్ ఐపీఎల్-2023లో తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ తనను విమర్శించిన వాళ్లకు బ్యాట్‌తోనే సమాధానమిస్తున్నాడు. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో వచ్చిన ఈ చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ రహానే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేసి సత్తా చాటాడు.
దంచికొట్టి.. ప్రశంసలు అందుకుంటూ
34 ఏళ్ల వయసులో 19 బంతుల్లోనే 50 పరుగుల మార్కు అందుకున్నాడు. కెప్టెన్ ధోని తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక పదహారో ఎడిషన్‌లో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో కలిపి రహానే చేసిన పరుగులు 129. అత్యధిక స్కోరు 61.
ఆర్సీబీతో మ్యాచ్‌లో రహానే ఇలా
బెంగళూరు వేదికగా ఆర్సీబీతో సోమవారం ఆడిన మూడో మ్యాచ్‌లో రహానే 20 బంతుల్లో 37 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లతో పాటు 2 సిక్సర్లు ఉన్నాయి. బ్యాటింగ్ సంగతి ఇలా ఉంటే.. చిన్నస్వామి స్టేడియంలో రహానే అద్భుత ఫీల్డింగ్‌తో మెరిసిన తీరు హైలైట్‌గా నిలిచింది.
మాక్సీ సిక్స్ అనుకున్నాడు.. కానీ
ఆర్సీబీ ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో ధోని బంతిని రవీంద్ర జడేజా చేతికి ఇచ్చాడు. ఓవర్ చివర్లో జడ్డూ వేసిన బంతిని మాక్సీ లాంగాఫ్ దిశగా షాట్ ఆడాడు. సిక్స్ ఖాయమనుకున్న దశలో రహానే అద్భుతం చేశాడు.
ఆ 5 పరుగులు సేవ్ చేయకుంటే
బంతిని క్యాచ్ పట్టిన రహానే బ్యాలెన్స్ చేసుకోలేకపోయాడు. కానీ సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. బంతిని వెంటనే బౌండరీ ఇవతలకు విసిరేసి ఐదు పరుగులు సేవ్ చేశాడు. రహానే సూపర్‌మాన్ విన్యాసానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
కాగా ఈ మ్యాచ్‌లో చెన్నె 8 పరుగుల స్వల్ప తేడాతో ఆర్సీబీ మీద గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డెత్ ఓవర్లలో రాణించిన సీఎస్‌కే యువ పేసర్ పతిరణ సహా ఐదు పరుగులు సేవ్ చేసిన రహానేపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న రహానేను టీమిండియా సెలక్టర్లు దృష్టిలో పెట్టుకోవాలని.. రహానే ఆట ఇలాగే కొనసాగితే అతడి రీఎంట్రీ ఖాయమంటూ కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: వాళ్లిద్దరు ఇంకాసేపు క్రీజులో ఉంటే మేము ఓడిపోయేవాళ్లం.. కానీ: ధోని
Ajink-waah🤩
— JioCinema (@JioCinema) April 17, 2023
Rahane's 🔝effort on the boundary saves a certain maximum!#RCBvCSK #IPLonJioCinema #TATAIPL #IPL2023 | @ajinkyarahane88 pic.twitter.com/8Q5YzN4nF5
Thou shall not pass, says Ajinkya Rahane#RCBvCSK | #IPL2023 pic.twitter.com/BY1YbbhD0a
— Sportstar (@sportstarweb) April 17, 2023
Comments
Please login to add a commentAdd a comment