
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరోసారి మంచి మనసును చాటుకున్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదో సారి ఛాంపియన్‌గా నిలబెట్టిన ధోని.. అనంతరం మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకుని ఫామ్‌హౌస్‌లో తన కుటుంబంతో సేద తీరుతున్నాడు. కొద్ది రోజుల కిందట ఫ్లయిట్‌లో క్యాండీ క్రష్ ఆడుతూ వార్తల్లో నిలిచిన ధోని.. తాజాగా మరోసారి టాక్ ఆఫ్ ది సోషల్‌మీడియాగా మారాడు. ధోని సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది.
Dhoni dropping his security in gate
— DHONI Era™ 🤩 (@TheDhoniEra) July 2, 2023
😍🤌❤️@MSDhoni #MSDhoni #WhistlePodu pic.twitter.com/vhVMKqn49w
ఈ వీడియోలో ధోని నడుచుకుంటూ వెళ్తున్న తన ఫామ్‌హౌస్ సెక్యూరిటి గార్డ్‌కు బైక్‌పై లిఫ్ట్ ఇస్తూ కనిపించాడు. ధోని తనే స్వయంగా బైక్ నడుపుకుంటూ గార్డ్‌ను గేట్ దగ్గర దిగబెట్టాడు. ఆ సమయంలో గేట్ వద్ద ఉన్న కొందరు అభిమానులు మొబైల్‌లో ఈ సన్నివేశాన్ని బంధించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తుంది. ఇది చూసి ధోని అభిమానులు.. తలా మంచితనం మరోసారి ప్రపంచానికి తెలిసిందంటూ కామెంట్లు చేస్తున్నారు. మనసున్న మారాజు మా ధోని అంటూ ఆకాశానికెత్తుతున్నారు.
ఇదిలా ఉంటే, ఇటీవల ముగిసిన ఐపీఎలే ధోనికి ఆఖరిదని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఐదో ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన అనంతరం ధోని ఈ ప్రచారాన్ని కొట్టిపారేశాడు. తనకు మరో ఐపీఎల్ సీజన్ ఆడే ఓపిక ఉందంటూ సంకేతాలు పంపాడు. మరి, ధోని ఐపీఎల్ 2024 ఆడతాడో లేక ఆఖరి నిమిషంలో రిటైర్మెంట్ ప్రకటిస్తాడో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment