PC: IPL.com
IPL 2023 RCB Vs CSK Live Updates:
డుప్లెసిస్, మాక్సీ మెరుపులు వృధా.. పోరాడి ఓడిన ఆర్సీబీ
చిన్నస్వామి స్టేడియం వేదికగా సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో 8 పరుగుల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. 227 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేయగల్గింది. ఆఖరి ఓవర్‌లో ఆర్సీబీ విజయానికి 19 పరుగులు అవసరమవ్వగా.. 10 పరుగులు మాత్రమే వచ్చాయి.
ఇక ఆర్సీబీ బ్యాటర్లలో కెప్టెన్ డుప్లెసిస్(62), మాక్స్‌వెల్(76) అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ.. విజయం మాత్రం సీఎస్‌కే వైపే నిలిచింది. సీఎస్‌కే బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే మూడు వికెట్లు పడగొట్టగా.. పతిరాన రెండు, మొయిన్ అలీ, థీక్షణ తలా వికెట్ సాధించారు.
►192 పరుగుల వద్ద ఆర్సీబీ ఆరో వికెట్ కోల్పోయింది. ఆర్సీబీ విజయానికి 17 బంతుల్లో 35 పరుగులు కావాలి. క్రీజులో పార్నల్, ప్రభ్‌దేశాయ్ ఉన్నారు.
నాలుగో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ.. డుప్లెసిస్ ఔట్
159 పరుగుల వద్ద ఆర్సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. 62 పరుగులు చేసిన డుప్లెసిస్ మొయిన్ అలీ బౌలింగ్‌లో.. ధోనికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.
మాక్స్‌వెల్ ఔట్..
ఎట్టకేలకు సీఎస్‌కే వికెట్ సాధించింది. 142 పరుగులు వద్ద గ్లెన్ మాక్స్‌వెల్ రూపంలో ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. 76 పరుగులు చేసిన మాక్స్‌వెల్..థీక్షణ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.
దూకుడుగా ఆడుతున్న డుప్లెసిస్..
ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ ఆర్సీబీ ధాటిగా ఆడుతోంది. కెప్టెన్ డుప్లెసిస్(48), మాక్స్‌వెల్(34) స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. 8 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ రెండు వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది.
రెండో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ..
227 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన లోమ్రోర్.. దేశ్‌పాండే బౌలింగ్‌లో గైక్వాడ్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.
తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ..
227 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. ఆకాష్ సింగ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.
Photo Credit : IPL Website
కాన్వే, దుబే విధ్వంసం.. ఆర్సీబీ టార్గెట్ 227 పరుగులు
ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సీఎస్‌కే బ్యాటర్లలో కాన్వే(45 బంతుల్లో 83 పరుగులు), శివమ్ దుబే(52) పరుగులతో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్, పార్నల్, వైశ్యాఖ్,హర్షల్ పటేల్, హసరంగా, మాక్స్‌వెల్ తలా వికెట్ సాధించారు.
నాలుగో వికెట్ కోల్పోయిన సీఎస్‌కే..
178 పరుగుల వద్ద సీఎస్‌కే నాలుగో వికెట్ కోల్పోయింది. 52 పరుగులు చేసిన శివమ్ దుబే.. పార్నల్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి మొయిన్ అలీ వచ్చాడు.
Photo Credit : IPL Website
మూడో వికెట్ కోల్పోయిన సీఎస్‌కే..
170 పరుగులు వద్ద సీఎస్‌కే మూడో వికెట్ కోల్పోయింది. 83 పరుగులు చేసిన కాన్వే.. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.
Photo Credit : IPL Website
14 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్: 146/2
సీఎస్‌కే భారీ స్కోర్ దిశగా వెళ్తుతోంది. 14 ఓవర్లు ముగిసే సరికి సీఎస్‌కే రెండు వికెట్లు నష్టానికి 146 పరుగులు చేసింది. క్రీజులో కాన్వే(72), దుబే(32) ఉన్నారు.
రెండో వికెట్ కోల్పోయిన సీఎస్‌కే..
90 పరుగులు వద్ద సీఎస్‌కే రెండో వికెట్ కోల్పోయింది. 37 పరుగులు చేసిన రహానే.. హాసరంగా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.
Photo Credit : IPL Website
6 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్: 53/1
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే పవర్ ప్లే ముగిసే సరికి వికెట్ నష్టానికి 53 పరుగులు చేసింది. క్రీజులో రహానే(28), గైక్వాడ్(22) పరుగులతో ఉన్నారు.
Photo Credit : IPL Website
తొలి వికెట్ కోల్పోయిన సీఎస్‌కే.. గైక్వాడ్ ఔట్
16 పరుగులు వద్ద సీఎస్‌కే తొలి వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన గైక్వాడ్.. సిరాజ్ బౌలింగ్‌లో పార్నల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.
Photo Credit : IPL Website
2 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్: 16/0
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే రెండు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 16 పరుగులు చేసింది. క్రీజులో గైక్వాడ్(3), కాన్వే(11) ఉన్నారు.
ఐపీఎల్-2023లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతున్నాయి.
Photo Credit : IPL Website
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఎటువంటి మార్పులు లేకుండా ఆర్సీబీ బరిలోకి దిగింది. సీఎస్‌కే మాత్రం తమ జట్టులో రెండు మార్పులు చేసింది. గాయపడిన మగాల స్థానంలో శ్రీలంక యువ పేసర్ మతీషా పతిరణ వచ్చాడు. అదే విధంగ ఆకాష్ సింగ్ స్థానంలో రాయుడుకు చోటు దక్కింది.
తుది జట్లు:
చెన్నై సూపర్ కింగ్స్ : రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (కెప్టెన్), మతీషా పతిరణ, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), వనిందు హసరంగా, హర్షల్ పటేల్, వేన్ పార్నెల్, వైషాక్ విజయ్ కుమార్, మహ్మద్ సిరాజ్
Comments
Please login to add a commentAdd a comment