
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా చటోగ్రామ్ ఛాలెంజర్స్‌తో జరిగిన సెకండ్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో కొమిల్లా విక్టోరియన్స్ బ్యాటర్ మొయిన్ అలీ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో అలీ బ్యాట్‌తోను, బాల్‌తోను అద్భుతంగా రాణించాడు. కేవలం 13 బంతుల్లో 30 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 2 సిక్స్‌లు, 3ఫోర్లు ఉన్నాయి. అదే విధంగా బౌలింగ్‌లో కూడా మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి బ్యాటర్లకు అలీ చెమటలు పట్టించాడు. ఈ మ్యాచ్‌లో 3 ఓవర్లు వేసిన అలీ 20 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.
ఇక టాస్ గెలిచి బ్యాటింగ్‌కు వచ్చిన చటోగ్రామ్ ఛాలెంజర్స్ 19.1 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌటైంది. చటోగ్రామ్ బ్యాటర్లలో మెహది హసన్(44), అక్బర్ అలీ(33), పరగులుతో రాణించారు. ఇక కొమిల్లా బౌలర్లలో షాహిదుల్ ఇస్లాం, మొయిన్ అలీ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. ఇక 149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కొమిల్లా.. కేవలం 12.5 ఓవర్లలోనే మూడు వికెట్లు కొల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. ఓపెనర్ సునీల్ నరైన్ కేవలం 16 బంతుల్లోనే 57 పరుగులు చేసి కొమిల్లా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఐపీఎల్-2022లో రూ. 8 కోట్లతో మొయిన్ అలీని చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే.
చదవండి: IPL 2022: ఆర్సీబీ కెప్టెన్‌గా దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు.. వేలంలో 7కోట్లు!
Comments
Please login to add a commentAdd a comment