ప్రపంచకప్‌లో భాగంగా దాయాది పాకిస్థాన్‌ను భారత్ 86 పరుగులతో చిత్తు చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించడంతో ఇటు మైదానంలో, అటు దేశవ్యాప్తంగా సంబరాలు వెల్లువెత్తాయి. ఈ సంబరాల్లో టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్, మహేంద్రసింగ్ ధోనీ తనయ జివా ప్రత్యేకంగా నిలిచారు. మ్యాచ్ ముగియగానే ఈ ఇద్దరు భారత్ విజయాన్ని ఎంజాయ్ చేస్తూ కేకలు వేశారు.