ప్రపంచకప్‌: విజయ్‌ శంకర్‌ తొలి మ్యాచ్‌లోనే.. | World Cup 2019 Vijay Shankar Picks Up Wicket With First Ball | Sakshi
Sakshi News home page

ప్రపంచకప్‌: విజయ్‌ శంకర్‌ తొలి మ్యాచ్‌లోనే..

Published Sun, Jun 16 2019 9:16 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

ప్రపంచకప్‌లో ఆరంభపు మ్యాచ్‌లోనే టీమిండియా ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. వేసిన తొలి బంతికే వికెట్‌ దక్కించుకొని సరికొత్త రికార్డు నెలకొల్పాడు. పాకిస్తాన్‌ ఓపెనర్‌ ఇమామ్‌ ఉల్‌ హక్‌‌(7)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని బోల్తా కొట్టించాడు. పాక్‌ ఇన్నింగ్స్‌ సందర్భంగా ఐదో ఓవర్‌లో నాలుగు బంతులు వేసిన అనంతరం పలు కారణాలతో భువనేశ్వర్‌ మైదానం వీడాడు. దీంతో చివరి రెండు బంతులు వేయడానికి విజయ్‌ శంకర్‌ బంతిని అందుకున్నాడు. వేసిన తొలి బంతికే వికెట్‌ దక్కడంతో శంకర్‌తో సహా అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement