వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఔటైన తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బంతి కనీసం బ్యాట్‌కు తగలకుండానే కోహ్లి పెవిలియన్ వీడటం సగటు క్రీడాభిమానిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. కోహ్లి స్వీయ తప్పిదం కారణంగా అతని వికెట్‌ను చేజార్చుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. వర్షం వెలిసిన తర్వాత విరాట్ కోహ్లి, విజయ్ శంకర్ తిరిగి క్రీజ్‌లోకి వచ్చారు.