టీమిండియా సారథి విరాట్ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌లో మరో మైలురాయిని అందుకున్నాడు. ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 57 పరుగులు చేయడంతో వన్డేల్లో 11 వేల పరుగులు పూర్తి చేసిన తొమ్మిదో ఆటగాడిగా ఆరుదైన ఘనతను సాధించాడు. అంతేకాకుండా అత్యంత వేగంగా ఈ ఘనత అందుకున్న ఆటగాడిగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.