Did MS Dhoni Intentionally Choose To Not Show His Elder Brother In Biopic?: మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరు వినగానే.. మిస్టర్ కూల్.. టీమిండియాకు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన లెజెండరీ కెప్టెన్.. చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన తలా... ఠక్కున గుర్తుకువచ్చే విషయాలివే! భారత క్రికెటర్‌గా శిఖరాగ్రాలను అధిరోహించిన ధోని వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు!
అదేంటి.. మేము కూడా ధోని బయోపిక్.. ఎంఎస్ ధోని:ది అన్‌టోల్డ్ స్టోరీ చూశాం! ధోని తల్లిదండ్రులు పాన్‌సింగ్, దేవకీ దేవి, ధోని సోదరి జయంతి గుప్తా గురించి తెలుసు! ఇక మహేంద్రుడి భార్య సాక్షి సింగ్, కుమార్తె జీవా ధోని గురించి తెలిసిందే! ఇంతకంటే.. కొత్తగా తెలుసుకోవాల్సింది ఏముందనుకుంటున్నారా?!
ధోని తోబుట్టువు!
ఉందండీ!.. దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో ధోని మరో తోబుట్టువు, సోదరుడి గురించి ప్రస్తావించలేదు. అవును.. ధోనికి ఓ అన్న ఉన్నాడు. అతడి పేరు నరేంద్ర సింగ్ ధోని. కొన్నాళ్ల క్రితం ధోని రాంచిలోని తన పొలంలో ముగ్గురు వ్యక్తులతో దిగిన ఫొటోను నెట్టింట వైరల్ అయింది.
అతడు నరేంద్రేనా?
ఐపీఎల్-2023 టైటిల్ గెలిచిన తర్వాత నరేంద్ర.. ధోనిని కలిశాడని ది క్రిక్‌టైమ్ వెల్లడించింది. ధోని గ్యారేజీ టూర్‌కు సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న తరుణంలో ఈ ఫొటోలను తెరమీదకు తెచ్చారు కొంతమంది. సాధారణ కుటుంబం నుంచి వచ్చి దాదాపు వెయ్యి కోట్లకు అధిపతిగా ఎదిగిన ధోని.. అన్న గురించి మాత్రం ఎందుకు ఎప్పుడూ ప్రస్తావించలేదో అర్థం కావడం లేదంటూ కామెంట్లు చేస్తున్నారు.
దీనస్థితిలో ఉన్నట్లు కనిపిస్తోంది!
అతడి పరిస్థితి చూస్తుంటే దీనస్థితిలో ఉన్నట్లు కనిపిస్తోందని సానుభూతి చూపిస్తున్నారు. బయోపిక్‌లోనూ అతడి ప్రస్తావన ఎందుకు లేదని ప్రశ్నిస్తున్నారు. అయితే, ఎంఎస్ అభిమానులు కూడా ఇందుకు దీటుగానే బదులిస్తున్నారు. నరేంద్ర సింగ్ ధోని గతంలో టెలిగ్రాఫ్ ఇండియా పేపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూతో ట్రోల్స్‌కు సమాధానమిస్తున్నారు.\
తనకు నేను సాయం చేయలేదు.. అయినా
‘మహీ బాల్యం, యువకుడిగా ఉన్నపుడు కష్టాలు పడ్డ సమయంలో నేను తనకు సాయం చేసిందేమీ లేదు.. ఈ ప్రపంచానికి ఎంఎస్‌డీగా పరిచయమవడంలో కూడా నా ప్రమేయమేమీ లేదు. నిజానికి ఈ సినిమా మహీ గురించి.. అతడి కుటుంబం గురించి కాదు!
ఇరికించాల్సిన అవసరం లేదు
మహీ నాకంటే పదేళ్లు చిన్నవాడు. తను మొదటిసారి బ్యాట్ పట్టుకునే సమయానికి నేను రాంచి నుంచి వెళ్లిపోయాను. ఉన్నత విద్య కోసం అల్మోరాలోని కుమాన్ యూనివర్సిటీకి వెళ్లిపోయాను. అయితే, మహీకి కొన్ని విషయాల్లో నేను నైతికంగా అండగా ఉన్నప్పటికీ అవన్నీ సినిమాలో ఇరికించాల్సిన అవసరం లేదు’’ అని నరేంద్ర సింగ్ ధోని నాటి ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు.
రాజకీయ నాయకుడిగా
కాగా నరేంద్ర సింగ్ ధోనికి రాజకీయాలంటే ఆసక్తి ఉన్నట్లు తెలుస్తోంది. 2013లో అతడు సమాజ్‌వాదీ పార్టీలో చేరినట్లు సమాచారం. అంతకుముందు బీజేపీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక 2007లో వివాహం చేసుకున్న నరేంద్రకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే.. 42 ఏళ్ల ధోని ఐపీఎల్-2024లోనూ బరిలోకి దిగే అవకాశాలు పుష్కలంగానే కనిపిస్తున్నాయి.
చదవండి: 20 లక్షలు పెట్టాడు.. గూస్‌బంప్స్ వచ్చాయి! ఏకంగా కోటి 70 లక్షలు.. కళ్లెమ్మట నీళ్లు..
సూర్యకు 32, నాకింకా 22 ఏళ్లే.. అతడితో పోలికా?: పాక్ బ్యాటర్ ఓవరాక్షన్
Comments
Please login to add a commentAdd a comment