Sakshi Singh Dhoni
-
MS Dhoni: ప్యారిస్ టూర్లో జీవాతో పాటు ధోని- సాక్షి (ఫొటోలు)
-
#Dhoni: స్ట్రైక్‌రేటు 231.25.. సీఎస్కే ఓడిందా?!..
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్‌తో అభిమానులను ఉర్రూతలూగించాడు మహేంద్ర సింగ్ ధోని. విశాఖపట్నంలో వింటేజ్ తలాను గుర్తుచేస్తూ ఈ చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ స్టేడియాన్ని హోరెత్తించాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి ధనాధన్ ఇన్నింగ్స్‌తో దంచికొట్టాడు. కేవలం 16 బంతుల్లోనే.. నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 37 పరుగులు రాబట్టాడు. ఐపీఎల్-2024లో తొలిసారి బ్యాటింగ్ చేసి ఏకంగా 231.25 స్ట్రైక్‌రేటు నమోదు చేశాడు.ఇక ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా(21)తో కలిసి ధోని ఆఖరి వరకు అజేయంగా నిలిచినా.. సీఎస్కేను గెలుపుతీరాలకు చేర్చలేకపోయాడు. ఢిల్లీ క్యాపిటల్స్ విధించిన 192 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ఈ మేరకు సీఎస్కే విఫలం కావడంతో సీజన్లో తొలి ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.అయితే, ఈ మ్యాచ్‌లో సీఎస్కే ఓడినా ధోని మాత్రం తన ఇన్నింగ్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడనడంలో సందేహం లేదు. ఎలక్ట్రిక్ స్ట్రైకర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ధోని అందుకున్నపుడు వైఎస్సార్ స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. ఆ సమయంలో ఒక్క క్షణంపాటు సీఎస్కేనే గెలిచిందేమో అన్న భావన కలిగిందనడం అతిశయోక్తి కాదు.ధోని సతీమణి సాక్షి కూడా ఇదే మాట అంటున్నారు. తలా అవార్డు స్వీకరిస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘‘హాయ్ మహీ ఉన్నావా?!.. మనం మ్యాచ్ ఓడిపోయామంటే నమ్మబుద్ధి కావడం లేదు’’ అంటూ ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్‌ను కూడా ట్యాగ్ చేశారు. నెటిజన్లను ఆకర్షిస్తున్న సాక్షి పోస్టు వైరల్‌గా మారింది.కాగా ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఈ సీజన్లో విశాఖ హోంగ్రౌండ్ అయినా.. మెజారిటీ ప్రేక్షకులు ధోని కోసం సీఎస్కే జెర్సీలతో స్టేడియానికి రావడం విశేషం. ఇక ఈ మ్యాచ్‌లో సీఎస్కేపై 20 పరుగులతో గెలిచినఢిల్లీ క్యాపిటల్స్ పదిహేడో ఎడిషన్‌లో తొలి విజయం అందుకుంది. -
దీనస్థితిలో ధోని సొంత అన్న? బయోపిక్‌లో ఎందుకు లేడు? అయినా అతడితో..
Did MS Dhoni Intentionally Choose To Not Show His Elder Brother In Biopic?: మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరు వినగానే.. మిస్టర్ కూల్.. టీమిండియాకు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన లెజెండరీ కెప్టెన్.. చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన తలా... ఠక్కున గుర్తుకువచ్చే విషయాలివే! భారత క్రికెటర్‌గా శిఖరాగ్రాలను అధిరోహించిన ధోని వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు! అదేంటి.. మేము కూడా ధోని బయోపిక్.. ఎంఎస్ ధోని:ది అన్‌టోల్డ్ స్టోరీ చూశాం! ధోని తల్లిదండ్రులు పాన్‌సింగ్, దేవకీ దేవి, ధోని సోదరి జయంతి గుప్తా గురించి తెలుసు! ఇక మహేంద్రుడి భార్య సాక్షి సింగ్, కుమార్తె జీవా ధోని గురించి తెలిసిందే! ఇంతకంటే.. కొత్తగా తెలుసుకోవాల్సింది ఏముందనుకుంటున్నారా?! ధోని తోబుట్టువు! ఉందండీ!.. దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో ధోని మరో తోబుట్టువు, సోదరుడి గురించి ప్రస్తావించలేదు. అవును.. ధోనికి ఓ అన్న ఉన్నాడు. అతడి పేరు నరేంద్ర సింగ్ ధోని. కొన్నాళ్ల క్రితం ధోని రాంచిలోని తన పొలంలో ముగ్గురు వ్యక్తులతో దిగిన ఫొటోను నెట్టింట వైరల్ అయింది. అతడు నరేంద్రేనా? ఐపీఎల్-2023 టైటిల్ గెలిచిన తర్వాత నరేంద్ర.. ధోనిని కలిశాడని ది క్రిక్టైమ్ వెల్లడించింది. ధోని గ్యారేజీ టూర్‌కు సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న తరుణంలో ఈ ఫొటోలను తెరమీదకు తెచ్చారు కొంతమంది. సాధారణ కుటుంబం నుంచి వచ్చి దాదాపు వెయ్యి కోట్లకు అధిపతిగా ఎదిగిన ధోని.. అన్న గురించి మాత్రం ఎందుకు ఎప్పుడూ ప్రస్తావించలేదో అర్థం కావడం లేదంటూ కామెంట్లు చేస్తున్నారు. దీనస్థితిలో ఉన్నట్లు కనిపిస్తోంది! అతడి పరిస్థితి చూస్తుంటే దీనస్థితిలో ఉన్నట్లు కనిపిస్తోందని సానుభూతి చూపిస్తున్నారు. బయోపిక్‌లోనూ అతడి ప్రస్తావన ఎందుకు లేదని ప్రశ్నిస్తున్నారు. అయితే, ఎంఎస్ అభిమానులు కూడా ఇందుకు దీటుగానే బదులిస్తున్నారు. నరేంద్ర సింగ్ ధోని గతంలో టెలిగ్రాఫ్ ఇండియా పేపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూతో ట్రోల్స్‌కు సమాధానమిస్తున్నారు.\ తనకు నేను సాయం చేయలేదు.. అయినా ‘మహీ బాల్యం, యువకుడిగా ఉన్నపుడు కష్టాలు పడ్డ సమయంలో నేను తనకు సాయం చేసిందేమీ లేదు.. ఈ ప్రపంచానికి ఎంఎస్డీగా పరిచయమవడంలో కూడా నా ప్రమేయమేమీ లేదు. నిజానికి ఈ సినిమా మహీ గురించి.. అతడి కుటుంబం గురించి కాదు! ఇరికించాల్సిన అవసరం లేదు మహీ నాకంటే పదేళ్లు చిన్నవాడు. తను మొదటిసారి బ్యాట్ పట్టుకునే సమయానికి నేను రాంచి నుంచి వెళ్లిపోయాను. ఉన్నత విద్య కోసం అల్మోరాలోని కుమాన్ యూనివర్సిటీకి వెళ్లిపోయాను. అయితే, మహీకి కొన్ని విషయాల్లో నేను నైతికంగా అండగా ఉన్నప్పటికీ అవన్నీ సినిమాలో ఇరికించాల్సిన అవసరం లేదు’’ అని నరేంద్ర సింగ్ ధోని నాటి ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు. రాజకీయ నాయకుడిగా కాగా నరేంద్ర సింగ్ ధోనికి రాజకీయాలంటే ఆసక్తి ఉన్నట్లు తెలుస్తోంది. 2013లో అతడు సమాజ్‌వాదీ పార్టీలో చేరినట్లు సమాచారం. అంతకుముందు బీజేపీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక 2007లో వివాహం చేసుకున్న నరేంద్రకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే.. 42 ఏళ్ల ధోని ఐపీఎల్-2024లోనూ బరిలోకి దిగే అవకాశాలు పుష్కలంగానే కనిపిస్తున్నాయి. చదవండి: 20 లక్షలు పెట్టాడు.. గూస్బంప్స్ వచ్చాయి! ఏకంగా కోటి 70 లక్షలు.. కళ్లెమ్మట నీళ్లు.. సూర్యకు 32, నాకింకా 22 ఏళ్లే.. అతడితో పోలికా?: పాక్ బ్యాటర్ ఓవరాక్షన్ -
ధోని ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్.. ఐపీఎల్ ట్రోఫీతో పాటు..?
MS Dhoni And Sakshi Dhoni Expecting Their Second Child In 2022: ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌ను నాలుగోసారి(2010, 2011, 2018, 2021) విజేతగా నిలిపి ఆ ఫ్రాంఛైజీ అభిమానులు గర్వపడేలా చేసిన మహేంద్ర సింగ్ ధోని.. తన ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్ కూడా చెప్పాడు. ధోని రెండోసారి తండ్రి కాబోతున్న విషయాన్ని అతని భార్య సాక్షి సింగ్ రావత్ స్నేహితురాలు, సురేశ్ రైనా భార్య ప్రియాంక రైనా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. సాక్షి రావత్ ప్రస్తుతం నాలుగు నెలల గర్భవతి అని.. వచ్చే ఏడాదిలో ఆమె రెండో బిడ్డకు జన్మనివ్వనుందని ప్రియాంక రైనా పేర్కొన్నట్లు సమాచారం. నిన్న సీఎస్కే ట్రోఫీ గెలిచిన అనంతరం సాక్షి, కుమార్తె జీవాతో కలిసి మైదానంలోకి వచ్చి సందడి చేశారు. ఆ సమయంలో సాక్షి బేబీ బంప్ స్పష్టంగా కనిపించడంతో ధోని అభిమానులు విషయాన్ని కన్ఫర్మ్ చేసుకున్నారు. దీంతో ధోని ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా లభించినట్లైంది. ఇదిలా ఉంటే, శుక్రవారం జరిగిన ఐపీఎల్-2021 ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. కోల్‌కతా నైట్ రైడర్స్‌ను 27 పరుగుల తేడాతో ఓడించి, నాలుగోసారి ఐపీఎల్ ఛాంపియన్‌గా అవతరించింది. టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. డుప్లెసిస్ (86), రుతురాజ్ గైక్వాడ్ (32), రాబిన్ ఉతప్ప (31), మొయిన్ అలీ (37) రాణించారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో కేకేఆర్‌కు ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్ (50), శుభ్‌మన్ గిల్ (51) శుభారంభాన్ని అందించినప్పటికీ.. మిగతా బ్యాటర్లంతా తేలిపోవడంతో మోర్గాన్ సేన ఓటమిపాలై, మూడోసారి కప్‌కు గెలుచుకునే అవకాశాన్ని చేజార్చుకుంది. చదవండి: తీవ్ర విషాదం... గుండెపోటుతో యువ క్రికెటర్ మృతి -
'అప్పుడే పదేళ్లయిందా.. నమ్మలేకపోతున్నా'
రాంచీ : ఎంఎస్ ధోని.. టీమిండియా జట్టుకు ఒక కెప్టెన్‌గా, ఆటగాడిగా ఎంత సక్సెస్ అయ్యాడో.. వైవాహిక జీవితంలోనూ అంతే విజయం సాధించాడు. తన చిన్ననాటి స్నేహితురాలైన సాక్షి సింగ్‌ను ప్రేమించిన ధోని 2010 జూలై 4న పెళ్లి చేసుకున్నాడు. వీరి వివాహం జరిగి సరిగ్గా పదేళ్లు. ఈ పదేళ్లలో వారి జీవితంలో ఆనంద క్షణాలే తప్ప ఎటువంటి గొడవలు లేవు. ఆనందంగా గడుపుతున్న వీరి జీవితంలోకి జీవా వచ్చి ఆ సంతోషాన్ని మరింత రెట్టింపు చేసింది. తాజాగా పెళ్లి రోజును పురస్కరించుకొని ధోని భార్య సాక్షి ధోని గత పదేళ్లలో వారి మధ్య చోటుచేసుకున్న మధుర క్షణాలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్నారు. ఇందులో భాగంగా సాక్షి తన భర్త ధోనితో పాటు తమ గారాల పట్టి జీవాకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసుకుంది. (క్రికెటర్ కుశాల్ మెండిస్ అరెస్ట్) 'మా వైవాహిక జీవితానికి అప్పుడే పదేళ్లు పూర్తయ్యాయంటే నమ్మలేకపోతున్నా. పదేళ్లుగా ఇద్దరం కలిసి ఒక ఆనంద జీవితం గడిపాం. ఎన్నోసార్లు మా మధ్య చిన్న చిన్న గొడవలు జరిగినా ఎప్పటికప్పుడు సరిదిద్దుకునేవాళ్లం. మా ఇద్దరి జీవితాల్లోకి జీవా రావడం ఒక మధురమైన క్షణం. జీవితంలో నిజాయితీగా ఉన్నాం కాబట్టే మా బంధం మరింత బలపడింది. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నామంటే ప్రేమలో ఉన్న గొప్పతనం ఏంటనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. ' అంటూ రాసుకొచ్చారు. అంతకముందు ధోని, సాక్షిల పెళ్లి రోజు పురస్కరించుకొని బంధువులు, స్నేహితులు, అభిమానులు విషెస్ చెప్పారు. దానికి బదులుగా.. 'మాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు.. కష్టకాలంలో మాకు అండగా నిలిచిన బంధువులు, స్నేహితులు, అభిమానులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా.' అంటూ సాక్షి స్పందించారు. -
సోషల్ మీడియాకు దూరంగా ధోని..
హైదరాబాద్: కరోనా లాక్డౌన్ కారణంగా క్రికెట్ టోర్నీలు నిలిచిపోవడంతో భారత ఆటగాళ్లు ఇంటికే పరిమితమయ్యారు. అయితే మైదానంలో తమ ఫ్యాన్స్ మిస్సవుతున్న వినోదాన్ని సోషల్ మీడియా వేదికగా అందించే ప్రయత్నం చేస్తున్నారు. లైవ్ వీడియో చాట్, ఆన్లైన్ ఇంటర్వ్యూలతో ఫ్యాన్స్‌కు కావాల్సిన వినోదపు విందును భారత క్రికెటర్లు అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం భారత క్రికెట్లో అత్యంత చర్చనీయాంశమైన ఆటగాడు ఎంఎస్ ధోని. ఐపీఎల్, టీ20 ప్రపంచకప్ విషయాలు ప్రస్తావనకు వచ్చిన ప్రతీసారి ధోని భవిత్యంపై అందరూ చర్చిస్తున్నారు. అంతేకాకుండా ఈ మధ్య ధోని రిటైర్మెంట్ తీసకున్నాడనే వార్తతో పాటు, ట్విటర్లో హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అయింది. (ధోని.. నా హెలికాప్టర్ షాట్లు చూడు!) అయినప్పటికీ ఈ వార్తలపై ధోని స్పందించలేదు. అసలు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టక కొన్ని నెలలు కావస్తుంది. అయితే ధోని సోషల్ మీడియాకు ఎందుకు దూరంగా ఉంటున్నారనే ప్రశ్నకు ధోని సతీమణి సాక్షి బదులిచ్చారు. సోషల్ మీడియాలో చాలా ఆక్టీవ్‌గా ఉండే సాక్షి ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ ప్రజెంటర్ రూపా రమణి నిర్వహించిన లైవ్ సెషన్లో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలో ధోని సోషల్ మీడియాకు దూరంగా ఉండటానికి గల కారణాలను తెలిపారు. ‘కరోనా నేపథ్యంలో ప్రభుత్వం విధించిన నిబంధనలు పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించడంతోనే ధోని సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. దేశంలో ప్రధానికి మించిన వారు ఎవరు లేరని భావించి సోషల్ మీడియా వేదికగా ఏం మాట్లాడటంలేదు. కరోనాపై వీడియోలు చేయాలని ధోనీపై చాలా మంది ఒత్తిడి చేశారు. కానీ వాటన్నింటిని ధోని సున్నితంగా తిరస్కరించారు. ధోనిపై మీకున్న ప్రేమను అర్థం చేసుకోగలను కానీ అతను సోషల్ మీడియాను చాలా తక్కువగా వాడతారు. అతని ప్రొఫైల్ చూస్తే మీకే అర్థమవుతుంది’ అని సాక్షి వివరించారు. ఇక లాక్డౌన్ సమయంలో రాంచీలోని తన ఫామ్‌హౌస్‌లో కుటుంబంతో కలిసి ధోని సరదాగా గడుపుతున్నాడు. ధోని, కూతురు జీవాకు సంబంధించిన పలు ఫన్నీ వీడియోలను సాక్షి ఇన్‌స్టాలో షేర్ చేస్తున్న విషయం తెలిసిందే. (‘ధోనిని మిస్సవుతున్నా.. మళ్లీ ఆ రోజులు రావాలి’) Listen to @SaakshiSRawat spill the beans on Mahi’s absence from social media. Also hear what they’ve planned to do post the lockdown.❤️😇#Sakshi #MSDhoni @ChennaiIPL pic.twitter.com/XTSQV6AwvV — MS Dhoni Fans Official (@msdfansofficial) June 4, 2020 -
ధోని రిటైర్మెంట్పై సాక్షి ట్వీట్.. డిలీట్
ముంబై: టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోని రిటైర్మెంట్పై చర్చ మరోసారి పతాక స్థాయికి చేరుకుంది. ఇంగ్లండ్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్-2019 అనంతరం ధోని ఇప్పటివరకు టీమిండియా జెర్సీ ధరించలేదు. దీంతో అప్పటినుంచి ఈ జార్ఖండ్ డైనమెట్ రిటైర్మెంట్పై చర్చ ప్రారంభమైంది. ఐపీఎల్లో అతడి ప్రదర్శన ఆధారంగా తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉందని అందరూ భావించారు. కానీ కరోనా లాక్డౌన్ కారణంగా ఈ క్యాష్ రిచ్ లీగ్ టోర్నీ వాయిదా పడుతూ వస్తోంది. అయితే బుధవారం ధోని రిటైర్మెంట్ తీసుకున్నాడనే వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేసింది. అంతేకాకుండా #dhoniretire అనే హ్యాష్ ట్యాగ్ కూడా ట్విటర్లో తెగ ట్రెండ్ అయింది. దీంతో అతడి అభిమానులు గందరగోళానికి గురయ్యారు. అయితే ఈ వార్తలను ధోని సతీమణి సాక్షి సింగ్ రావత్‌తో పాటు అతడి సన్నిహితులు కొట్టిపారేశారు. ఈ క్రమంలో ధోని రిటైర్మెంట్పై సాక్షి చేసిన ట్వీట్ వివాదస్పదమైంది. ‘అవన్నీ పుకార్లు. లాక్డౌన్ కారణంగా ప్రజల మానసిక స్థితి దెబ్బతిన్నది అని నాకు అర్ధమవుతుంది’ అంటూ ట్వీట్ చేశారు. దీనిపై పలువురు అభ్యంతరం తెలపడంతో వెంటనే ఆ ట్వీట్‌ను సాక్షి తొలగించారు. అయితే అప్పటికే ఆ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయింది. గతంలో ధోని రిటైర్మెంట్పై సాక్షి కూల్‌గానే సమాధానమిచ్చారని, తరుచూ ఇలాంటి వార్తలు వస్తుండటంతో పూర్తిగా సహనం కోల్పోయి కోపంలో అలా ట్వీట్ చేశారని ధోని కుటుంబ సన్నిహితులు పేర్కొంటున్నారు. చదవండి: దడదడలాడించిన చమిందా వాస్ 'ధోని ప్లాన్ మాకు కప్పును తెచ్చిపెట్టింది' -
థాంక్యూ మహీ భాయ్: సింగర్
‘మీ కుటుంబంతో గడిపిన క్షణాలు అత్యద్భుతం. మాకు ఆతిథ్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు మహీ భాయ్- సాక్షి’ అంటూ సింగర్, ‘అల్లా వే’ ఫేం జేసీ గిల్ టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని కుటుంబంతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది తనకు, తన గ్యాంగ్‌కు మరిచిపోలేని ట్రిప్ అని పేర్కొన్నాడు. ఈ ఫొటోలు ప్రస్తుతం అభిమానులను ఆకర్షిస్తున్నాయి. కాగా పంజాబీలో ప్రముఖ గాయకుడిగా పేరు తెచ్చుకున్న జైసీ గిల్ పూర్తి పేరు జస్దీప్ సింగ్ గిల్. తన గాత్రంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న గిల్‌కు ధోని కుటుంబంతో అనుబంధం ఉంది. ఇటీవలే 31 వసంతంలోకి అడుగుపెట్టిన గిల్.. తన బర్త్‌డే ఫొటోలను కూడా అభిమానులతో పంచుకున్నాడు. ఇందులో ధోని భార్య సాక్షిధోని కూడా ఉండటం విశేషం. కాగా ప్రస్తుతం క్రికెట్‌కు దూరంగా ఉన్న ధోని కుటుంబంతో సరదాగా గడుపుతున్నాడు. ఇక వన్డే ప్రపంచ కప్ నుంచి టీమిండియా నిష్క్రమణ నాటి నుంచి ధోని కెరీర్‌పై సందిగ్ధత కొనసాగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. ధోని ఆటకు రిటైర్మెంట్ ప్రకటిస్తాడా లేదా క్రికెటర్‌గా కొనసాగుతాడా అనే అంశంలో ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు. ఈ క్రమంలో ధోని మొదటిసారి స్వయంగా గురువారం స్పందించాడు. అది కూడా ఏకవాక్యంలోనే! క్రికెట్లో పునరాగమనం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ...‘జనవరి వరకు నన్నేమీ అడగొద్దు’ అని తేల్చేశాడు. View this post on Instagram Thanku @mahi7781 bai & @sakshisingh_r for having us there 🤗🤗We all had a wonderful time !! #unforgettabletrip @preeti_simoes @neeti_simoes @priiyanshuchopraa @aarticia A post shared by Jassie Gill (@jassie.gill) on Dec 3, 2019 at 6:23am PST -
ధోని సతీమణి ట్వీట్ వివాదం కానుందా?
ముంబై: భారతీయ సినిమా పరిశ్రమలో క్రీడాకారులు జీవిత కథా చిత్రాల(బయోపిక్) హవా కొనసాగుతోంది. అథ్లెట్ మిల్కాసింగ్ జీవిత కథ ఆధారంగా భాగ్ మిల్కా భాగ్, బాక్సింగ్ ఛాంపియన్ జీవిత కథ ఆధారంగా మేరి కోమ్ చిత్రాలు రూపొందడమే కాకుండా వాణిజ్య పరంగా కూడా మంచి సక్సెస్ ను సాధించాయి. ఆ చిత్రాలు అందించిన స్పూర్తితో క్రికెటర్, భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కథ తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన వివారాల్ని, పోస్టర్ ను కెప్టెన్ ధోని సతీమణి సాక్షి ధోని ట్విటర్ లో పోస్ట్ చేశారు. ఈ చిత్రం పేరు 'ఎంఎస్ ధోని- ది అన్ టోల్డ్ స్టోరి' అని వెల్లడించారు. గత కొద్దిరోజులుగా వస్తున్న రూమర్లకు తెరదించే ప్రయత్నం చేద్దాం. రూమర్లలో వాస్తవం లేదు అని ట్విట్ చేశారు. ధోని పాత్రను బాలీవుడ్ నటుడు, శుద్ధ్ దేశి రొమాన్స్ చిత్ర హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పోషిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్ లో ధోని ఆడుతుండగా ఆయన జీవిత కథను తెరకెక్కించడాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అనుమతించకపోవడం కొంత వివాదంగా మారింది. కాని తాజాగా ధోని చిత్ర పోస్టర్ ను సాక్షి సింగ్ ధోని ట్విటర్ లో పోస్ట్ చేయడం గమనార్హం. ఈ అంశాన్ని బీసీసీఐ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. Clearing out all those rumours being carried out past few days.It was all false.. Here you go ....BOOM !!! pic.twitter.com/58vXAGe3Bc — Sakshi Singh Dhoni (@SaakshiSRawat) September 24, 2014