ముంబై: టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోని రిటైర్మెంట్‌పై చర్చ మరోసారి పతాక స్థాయికి చేరుకుంది. ఇంగ్లండ్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్-2019 అనంతరం ధోని ఇప్పటివరకు టీమిండియా జెర్సీ ధరించలేదు. దీంతో అప్పటినుంచి ఈ జార్ఖండ్ డైనమెట్ రిటైర్మెంట్‌పై చర్చ ప్రారంభమైంది. ఐపీఎల్‌లో అతడి ప్రదర్శన ఆధారంగా తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉందని అందరూ భావించారు. కానీ కరోనా లాక్‌డౌన్ కారణంగా ఈ క్యాష్ రిచ్ లీగ్ టోర్నీ వాయిదా పడుతూ వస్తోంది. అయితే బుధవారం ధోని రిటైర్మెంట్ తీసుకున్నాడనే వార్త సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేసింది. అంతేకాకుండా #dhoniretire అనే హ్యాష్ ట్యాగ్ కూడా ట్విటర్‌లో తెగ ట్రెండ్ అయింది. దీంతో అతడి అభిమానులు గందరగోళానికి గురయ్యారు.
అయితే ఈ వార్తలను ధోని సతీమణి సాక్షి సింగ్ రావత్‌తో పాటు అతడి సన్నిహితులు కొట్టిపారేశారు. ఈ క్రమంలో ధోని రిటైర్మెంట్‌పై సాక్షి చేసిన ట్వీట్ వివాదస్పదమైంది. ‘అవన్నీ పుకార్లు. లాక్‌డౌన్ కారణంగా ప్రజల మానసిక స్థితి దెబ్బతిన్నది అని నాకు అర్ధమవుతుంది’ అంటూ ట్వీట్ చేశారు. దీనిపై పలువురు అభ్యంతరం తెలపడంతో వెంటనే ఆ ట్వీట్‌ను సాక్షి తొలగించారు. అయితే అప్పటికే ఆ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయింది. గతంలో ధోని రిటైర్మెంట్‌పై సాక్షి కూల్‌గానే సమాధానమిచ్చారని, తరుచూ ఇలాంటి వార్తలు వస్తుండటంతో పూర్తిగా సహనం కోల్పోయి కోపంలో అలా ట్వీట్ చేశారని ధోని కుటుంబ సన్నిహితులు పేర్కొంటున్నారు.
చదవండి:
దడదడలాడించిన చమిందా వాస్
'ధోని ప్లాన్ మాకు కప్పును తెచ్చిపెట్టింది'
ధోని రిటైర్మెంట్‌పై సాక్షి ట్వీట్.. డిలీట్
Published Thu, May 28 2020 8:42 AM | Last Updated on Thu, May 28 2020 2:51 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment