ధోని సతీమణి ట్వీట్ వివాదం కానుందా? | BCCI opposes to picturise MS Dhoni life story as Bollywood film | Sakshi

ధోని సతీమణి ట్వీట్ వివాదం కానుందా?

Sep 25 2014 6:46 PM | Updated on Apr 3 2019 6:23 PM

ధోని సతీమణి ట్వీట్ వివాదం కానుందా? - Sakshi

ధోని సతీమణి ట్వీట్ వివాదం కానుందా?

భారతీయ సినిమా పరిశ్రమలో క్రీడాకారులు జీవిత కథా చిత్రాల(బయోపిక్) హవా కొనసాగుతోంది.

ముంబై: భారతీయ సినిమా పరిశ్రమలో క్రీడాకారులు జీవిత కథా చిత్రాల(బయోపిక్) హవా కొనసాగుతోంది. అథ్లెట్ మిల్కాసింగ్ జీవిత కథ ఆధారంగా భాగ్ మిల్కా భాగ్, బాక్సింగ్ ఛాంపియన్ జీవిత కథ ఆధారంగా మేరి కోమ్ చిత్రాలు రూపొందడమే కాకుండా వాణిజ్య పరంగా కూడా మంచి సక్సెస్ ను సాధించాయి. ఆ చిత్రాలు అందించిన స్పూర్తితో క్రికెటర్, భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కథ తెరకెక్కుతోంది. 
 
ఈ చిత్రానికి సంబంధించిన వివారాల్ని, పోస్టర్ ను కెప్టెన్ ధోని సతీమణి సాక్షి ధోని ట్విటర్ లో పోస్ట్ చేశారు. ఈ చిత్రం పేరు 'ఎంఎస్ ధోని- ది అన్ టోల్డ్ స్టోరి' అని వెల్లడించారు. గత కొద్దిరోజులుగా వస్తున్న రూమర్లకు తెరదించే ప్రయత్నం చేద్దాం. రూమర్లలో వాస్తవం లేదు అని ట్విట్ చేశారు. ధోని పాత్రను బాలీవుడ్ నటుడు, శుద్ధ్ దేశి రొమాన్స్ చిత్ర హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పోషిస్తున్నారు. 
 
అంతర్జాతీయ క్రికెట్ లో ధోని ఆడుతుండగా ఆయన జీవిత కథను తెరకెక్కించడాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అనుమతించకపోవడం కొంత వివాదంగా మారింది. కాని తాజాగా ధోని చిత్ర పోస్టర్ ను సాక్షి సింగ్ ధోని ట్విటర్ లో పోస్ట్ చేయడం గమనార్హం. ఈ అంశాన్ని బీసీసీఐ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement