ఐపీఎల్ ట్రోఫీతో సీఎస్‌కే కెప్టెన్ ధోని (PC: BCCI/IPL)
IPL 2024- No Venue Worries: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024 సీజన్ ఆరంభానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన ఈ క్యాష్ రిచ్ లీగ్ మార్చి 22న మొదలుకానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే విధంగా.. ఈసారి కూడా మ్యాచ్‌లన్నీ భారత్‌లోనే నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం.
కాగా దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ వేదికపై క్రీడా వర్గాల్లో గత కొంతకాలంగా చర్చ నడుస్తోంది. 2009 మాదిరి మ్యాచ్‌లన్నిటినీ విదేశంలో నిర్వహిస్తారా లేదంటే 2014 మాదిరి మొదటి సగం మ్యాచ్‌లను బయట పూర్తి చేసి స్వదేశంలో లాంఛనం పూర్తి చేస్తారా అన్న సందిగ్దం నెలకొంది.
విదేశాలకు తరలిస్తారా?
ఈ విషయంపై బీసీసీఐ అధికారి ఒకరు స్పందించారు. వార్తా సంస్థ ఏఎన్‌ఐతో మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. ‘‘దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ టోర్నమెంట్ వేదికను విదేశాలకు తరలిస్తారన్న సందేహాలే వద్దు.
ఈసారి అలాంటిదేమీ ఉండదు. సహేతుకమైన కారణాలు చూపుతూ ఏదైనా రాష్ట్రం మ్యాచ్ నిర్వహించలేమని చెబితే.. సదరు మ్యాచ్ వేదికను మరో రాష్ట్రానికి మార్చాలని భావిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. తద్వారా ఐపీఎల్-2024ను భారత్‌లోనే నిర్వహిస్తామనే సంకేతాలు ఇచ్చారు.
అప్పుడు అలా జరిగింది
కాగా ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ రెండో ఎడిషన్(2009)ను సౌతాఫ్రికాలో నిర్వహించగా.. ఏడో సీజన్(2014)లోని మొదటి సగం మ్యాచ్‌లకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆతిథ్యం ఇచ్చింది.
అదే విధంగా.. 2019లో తొలి 19 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను తొలుత విడుదల చేసిన ఐపీఎల్ పాలక మండలి.. ఎన్నికల నగారా మోగిన తర్వాత మిగతా మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ప్రకటించింది. అప్పుడు మ్యాచ్‌లన్నీ భారత్‌లోనే నిర్వహించింది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ పది ఫ్రాంఛైజీలు ఇప్పటికే తమ జట్లను ఖరారు చేసుకున్నాయి. కాగా గత సీజన్‌లో మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
చదవండి: Ind Vs Afg: అఫ్గన్‌తో టీమిండియా సిరీస్: షెడ్యూల్, జట్లు, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు
Comments
Please login to add a commentAdd a comment