ఇంటర్నేషనల్‌ మాస్టర్స్‌ చాంపియన్‌ భారత్‌ | International Masters Champion India | Sakshi
Sakshi News home page

ఇంటర్నేషనల్‌ మాస్టర్స్‌ చాంపియన్‌ భారత్‌

Published Mon, Mar 17 2025 3:14 AM | Last Updated on Mon, Mar 17 2025 3:14 AM

International Masters Champion India

ఫైనల్లో వెస్టిండీస్‌ మాస్టర్స్‌పై గెలుపు

రాణించిన రాయుడు, సచిన్, వినయ్‌ కుమార్‌

రాయ్‌పూర్‌: ఇంటర్నేషనల్‌ మాస్ట్సర్స్‌ లీగ్‌లో భారత మాస్టర్స్‌ జట్టు చాంపియన్‌గా నిలిచింది. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ సారథ్యంలో బరిలోకి దిగిన భారత మాస్టర్స్‌ జట్టు ఆదివారం రాయ్‌పూర్‌ వేదికగా జరిగిన ఫైనల్లో 6 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ మాస్టర్స్‌పై విజయం సాధించింది. తొలిసారి నిర్వహించిన ఈ లీగ్‌లో భారత జట్టు సమష్టి ప్రదర్శనతో సత్తా చాటింది. తుదిపోరులో మొదట బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ మాస్టర్స్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. 

సిమ్మన్స్‌ (41 బంతుల్లో 57; 5 ఫోర్లు, 1 సిక్స్‌), డ్వైన్‌ స్మిత్‌ (35 బంతుల్లో 45; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. భారత బౌలర్లలో వినయ్‌ కుమార్‌ 3, నదీమ్‌ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో భారత మాస్టర్స్‌ జట్టు 17.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. 

ఓపెనర్‌ అంబటి తిరుపతి రాయుడు (50 బంతుల్లో 74; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకంతో విజృంభించగా... కెపె్టన్‌ సచిన్‌ టెండూల్కర్‌ (25; 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. యువరాజ్‌ సింగ్‌ (13 నాటౌట్‌), గుర్‌కీరత్‌ సింగ్‌ (14), స్టువర్ట్‌ బిన్నీ (16 నాటౌట్‌) తలా కొన్ని పరుగులు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement