
ఐపీఎల్-2025లో భాగమైన ముంబై ఇండియన్స్ బౌలర్ కార్బిన్ బాష్‌కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నోటీసులు ఇచ్చింది. బాష్.. ఐపీఎల్ కాంట్రాక్ట్ కోసం పాకిస్తాన్ సూపర్ లీగ్ కాంట్రాక్ట్‌ను వదులుకున్నాడు. సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ అయిన బాష్.. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 ఎడిషన్ కోసం పెషావర్ జల్మీ ఫ్రాంచైజీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. బాష్‌కు అనుకోకుండా ఐపీఎల్ ఆఫర్ రావడంతో పీఎస్‌ఎల్ కాంట్రాక్ట్‌కు నో చెప్పాడు.
లిజాడ్ విలియమ్స్ గాయపడటంతో ముంబై ఇండియన్స్ బాష్‌ను రీప్లేస్‌మెంట్‌గా ఎంపిక చేసుకుంది. పీఎస్‌ఎల్ ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు గానూ పీసీబీ బాష్‌పై చర్యలకు ఉపక్రమించింది. ఫ్రాంచైజీ (పెషావర్ జల్మీ) ఏజెంట్ ద్వారా బాష్‌కు లీగల్ నోటీసులు పంపింది.
కాంట్రాక్ట్ ఉల్లంఘించినందుకు గానూ వివరణ ఇవ్వాలని కోరింది. పీఎస్‌ఎల్ నుండి వైదొలగడం వల్ల ఎదురయ్యే పరిణామాలను వివరించింది. ఈ విషయాన్ని ఇవాళ (మార్చి 16) ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. కాగా, ఐపీఎల్ 2025, పాకిస్తాన్ సూపర్ లీగ్-2025 తేదీలు క్లాష్ అయ్యాయి. పీఎస్‌ఎల్-2025 ఏప్రిల్ 11 నుండి మే 25 వరకు జరగనుండగా.. ఐపీఎల్ 2025 మార్చి 22 నుండి మే 25 వరకు జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment