Peshawar Zalmi
-
నిరాశపరిచిన బాబర్.. ఫైనల్‌కు చేరిన షాదాబ్ ఖాన్ జట్టు
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024లో పెషావర్ జల్మీ కథ ముగిసింది. ఈ లీగ్‌లో భాగంగా ఇస్లామాబాద్ యునైటెడ్‌తో జరిగిన ఎలిమినేటర్‌లో 5 వికెట్ల తేడాతో పెషావర్ ఓటమి పాలైంది. దీంతో ఈ లీగ్ నుంచి బాబర్ ఆజం సారథ్యంలోని పెషావర్ ఇంటిముఖం పట్టింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగుల భారీ స్కోర్ సాధించింది. జల్మీ బ్యాటర్లలో సైమ్ అయూబ్(44 బంతుల్లో 73,6 ఫోర్లు, 4 సిక్స్‌లు) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు మహ్మద్ హ్యారిస్(40) పరుగులతో రాణించాడు. ఇస్లామాబాద్ బౌలర్లలో నసీం షా 3 వికెట్లు పడగొట్టగా.. మెకాయ్, షాదాబ్ ఖాన్ తలా వికెట్ సాధించారు. అనంతరం 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇస్లామాబాద్ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇస్లామాబాద్ బ్యాటర్లలో మిడిలార్డర్ బ్యాటర్లు ఇమాద్ వసీం(59 నాటౌట్), హైదర్ అలీ(52 నాటౌట్) పరుగులతో కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. పెషావర్ బౌలర్లలో అయూబ్ రెండు వికెట్లు పడగొట్టగా.. వుడ్, ముమ్టాజ్, కుర్రామ్ తలా వికెట్ సాధించారు. ఇక మార్చి 18న కరాచీ వేదికగా జరగనున్న ఫైనల్లో ముల్తాన్ సుల్తాన్స్‌తో ఇస్లామాబాద్ యూనైటడ్ తలపడనుంది. -
మరోసారి చెలరేగిన బాబర్ ఆజమ్.. వరుసగా మూడో హాఫ్ సెంచరీ
పాకిస్తాన్ సూపర్ లీగ్ చివరి దశకు చేరింది. లీగ్ దశలో మరో మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ప్లే ఆఫ్స్ బెర్తులు ఇదివరకే ఖరారయ్యాయి. పెషావర్ జల్మీ, ముల్తాన్ సుల్తాన్స్, ఇస్లామాబాద్ యునైటెడ్, క్వెట్టా గ్లాడియేటర్స్ ఇదివరకే ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారు చేసుకోగా.. కరాచీ కింగ్స్, లాహోర్ ఖలందర్స్ లీగ్ నుంచి ఎలిమినేట్ అయ్యాయి. నిన్న జరిగిన నామమాత్రపు లీగ్ మ్యాచ్‌లో పెషావర్ జల్మీ.. కరాచీ కింగ్స్‌ను 2 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్.. కెప్టెన్ బాబర్ ఆజమ్ (51) మరోసారి చెలరేగడంతో 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. బాబర్‌కు ఇది వరుసగా మూడో హాఫ్ సెంచరీ కావడం విశేషం. పెషావర్ ఇన్నింగ్స్‌లో రోవ్‌మన్ పావెల్ (30) ఓ మోస్తరుగా రాణించాడు. కరాచీ బౌలర్లు డేనియల్ సామ్స్, జహీద్ మహమూద్, ఆరాఫత్, హసన్ అలీ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం నామమాత్రపు లక్ష్య ఛేదనకు దిగిన కరాచీ.. పెషావర్ బౌలర్ల దెబ్బకు చేతులెత్తేసింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి లక్ష్యానికి 3 పరుగుల దూరంలో నిలిచిపోయింది. నవీన్ ఉల్ హాక్ తన కోటా 4 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో పాటు 2 వికెట్లు పడగొట్టగా.. వుడ్, ఆమెర్ జమాల్, సైమ్ అయూబ్ పొదుపుగా బౌలింగ్ చేసి తలో వికెట్ పడగొట్టారు. టిమ్ సీఫర్ట్ (41), ఇర్ఫాన్ ఖాన్ (39 నాటౌట్) ఓ మోస్తరుగా రాణించినా కరాచీని గెలిపించలేకపోయారు. -
ఏడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి విధ్వంసం.. 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో! వీడియో వైరల్
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024లో పెషావర్ జల్మీ మరో ఓటమి చవిచూసింది. రావల్పిండి వేదికగా ఇస్లామాబాద్ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో 29 పరుగుల తేడాతో పెషావర్ ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో పెషావర్ ఓటమి పాలైనప్పటికి.. ఆ జట్టు యువ ఆల్‌రౌండర్ అమీర్ జమాల్ తన విరోచిత పోరాటంతో అందరని అకట్టుకున్నాడు. 197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పెషావర్ కేవలం 18 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన అమీర్ జమీల్ ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. మరో ఎండ్‌లో ఉన్న వాల్టర్‌తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. బౌండరీలు వర్షం కురిపించాడు. జమాల్ ఇన్నింగ్స్ చూసి పెషావర్ మరో విజయం తమ ఖాతాలో వేసుకుంటుందని అంతా భావించారు. కానీ ఆఖరిలో జమాల్ ఔట్ కావడంతో పెషావర్ ఓటమి చవిచూసింది. ఓవరాల్‌గా 49 బంతులు ఎదుర్కొన్న జమాల్ 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 87 పరుగులు చేశాడు. ఏడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి సంచలన ఇన్నింగ్స్ ఆడిన జమాల్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా లక్ష్య ఛేదనలో పెషావర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 167 పరుగులకే పరిమితమైంది. AAMER JAMAL PLAYING LIKE HE DID IN THE TESTS IN AUSTRALIA 🔥🔥🔥#HBLPSL9 #tapmad #HojaoAdFree pic.twitter.com/UeiRi24PSB — Farid Khan (@_FaridKhan) March 4, 2024 ఇస్లామాబాద్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టగా.. రీస్, హునైన్ షా తలా రెండు వికెట్లు సాధించారు.ఇక అంతకముందు బ్యాటింగ్ చేసిన ఇస్లామాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఇస్లామాబాద్ బ్యాటర్లలో కెప్టెన్ షాదాబ్(51 బంతుల్లో 80, 4ఫోర్లు,6 సిక్స్‌లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. Aamer Jamal REMEMBER THE NAME !🤝#HBLPSL9 #IUvPZ #PSL2024 pic.twitter.com/7Dgqv69zTD — Aussies Army🏏🦘 (@AussiesArmy) March 4, 2024 -
దమ్ముంటే ఇక్కడకు రా.. కట్టలు తెంచుకున్న బాబర్ ఆగ్రహం
Angry Babar Azam Fumes At Ill Mannered Fans: పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజంకు చేదు అనుభవం ఎదురైంది. ఓ ఆకతాయి బాబర్ ఆట తీరును కించపరిచేలా కామెంట్ చేశాడు. దీంతో సహనం కోల్పోయిన ఈ మాజీ కెప్టెన్ అతడి పైకి బాటిల్ విసిరాలని చూశాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అసలేం జరిగిందంటే.. పెషావర్ జల్మీ కెప్టెన్‌గా ఉన్న బాబర్ ఆజం.. ముల్తాన్ సుల్తాన్స్‌తో మ్యాచ్‌లో 31 పరుగులు చేశాడు. ముల్తాన్ వేదికగా శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బాబర్ ఆజం తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో పెషావర్ జల్మీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. 37 పరుగులతో హసీబుల్లా ఖాన్ జల్మీ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలవగా.. బాబర్ 31 పరుగులతో అతడి తర్వాతి స్థానంలో నిలిచాడు. ఇక లక్ష్య ఛేదనలో ముల్తాన్ సుల్తాన్స్ 174 పరుగులకే కుప్పకూలడంతో పెషావర్ జల్మీ 5 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది. మ్యాచ్ సంగతి ఇలా ఉంటే.. డగౌట్లో కూర్చున్న సమయంలో బాబర్ ఆజంను ఉద్దేశించి ఓ ప్రేక్షకుడు ‘జింబాబర్’ అంటూ అరిచాడు. This is really unacceptable, Never expected this from Multan fans.. 🤦♂️ pic.twitter.com/MgZWQlO8oR — Nibraz Ramzan (@nibraz88cricket) February 24, 2024 దీంతో బాబర్‌కు చిర్రెత్తుకొచ్చింది. ‘‘ఏయ్ దమ్ముంటే.. ఇక్కడకు రా’’ అంటూ సైగ చేసిన బాబర్ ఆజం.. తన చేతిలో ఉన్న వాటర్ బాటిల్ విసిరేస్తానంటూ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన బ్యాటింగ్ నైపుణ్యాలను తక్కువ చేసి మాట్లాడినందుకు తగిన బుద్ధి చెప్తానన్నట్లుగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘జింబాబర్’ అని ఎందుకన్నాడు? టీమిండియా స్టార్ బ్యాటర్, రన్‌మెషీన్ విరాట్ కోహ్లితో పోల్చదగిన సమకాలీన క్రికెటర్లలో ఒకడు బాబర్ ఆజం అని పలువురు పాక్ మాజీ క్రికెటర్ల అభిప్రాయం. అందుకు తగ్గట్లుగానే అంతర్జాతీయ స్థాయిలో అద్బుత ఇన్నింగ్స్‌తో మెరిశాడు ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్. అయితే, గత కొంతకాలంగా నిలకడలేమి ప్రదర్శనతో బాబర్ సతమతమవుతున్నాడు. ముఖ్యంగా పటిష్ట జట్ల మీద మెరుగైన స్కోర్లు సాధించలేకపోతున్నాడు. జింబాబ్వే వంటి పసికూన జట్లపై మాత్రం సెంచరీలు బాదాడు. ఈ నేపథ్యంలో చాలాకాలంగా.. ‘‘జింబాబర్’’అంటూ నెటిజన్లు అతడిని ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా పీఎస్ఎల్ మ్యాచ్‌లోనూ ఇలాగే ఆటపట్టించే ప్రయత్నం చేయగా.. బాబర్ కోపోద్రిక్తుడయ్యాడు. Kalesh b/w Babar Azam And One of guy from Crowd over he was Calling him "Zimbabar" during PSL match pic.twitter.com/mtR99WDmoW — Ghar Ke Kalesh (@gharkekalesh) February 24, 2024 -
ఫోజులు తర్వాత.. ముందు బౌలింగ్ మెరుగుపరుచుకో!
పాకిస్తాన్ పేసర్ హసన్ అలీ ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో బిజీగా ఉన్నాడు. ఇస్లామాబాద్ యునైటెడ్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న హసన్ అలీ టీమిండియా స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ ఫోజును కాపీ కొట్టాలని ప్రయత్నించాడు. ఐపీఎల్ సందర్భంగా రాజస్తాన్ రాయల్స్‌కు ఆడిన సమయంలో చహల్ బౌండరీ లైన్ అవతల.. బీచ్‌లో రిలాక్స్ మోడ్‌లో కూర్చొన్నట్లుగా ఫోజు ఇచ్చాడు. చహల్ ఇచ్చిన ఆ ఫోజు ఎవర్‌గ్రీన్‌గా మిగిలిపోయింది. ఆ తర్వాత ఎన్నోసార్లు ఎంతోమంది ఆటగాళ్లు చహల్లా ఫోజు ఇవ్వడానికి ప్రయత్నించారు. అప్పటికి, ఇప్పటికి ఎప్పుడు చహల్ ఫోజు ఐకానిక్‌లా మారిపోయింది. తాజాగా పెషావర్ జాల్మీతో ఎలిమినేటర్ మ్యాచ్ సందర్భంగా హసన్ అలీ చహల్ ఫోజును ఇమిటేట్ చేయాలనుకున్నాడు. అయితే చహల్ అప్పుడు మైదానం బటయ చేస్తే.. హసన్ అలీ మాత్రం గ్రౌండ్‌లోనే ఐకానిక్ ఫోజును ఇచ్చాడు. ఈ ఫోటోను పాకిస్తాన్ సూపర్ లీగ్ తన ట్విటర్లో షేర్ చేస్తూ క్యాప్షన్ ఏం ఇస్తారు అని అడిగింది. అయితే మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన హసన్ అలీ 37 పరుగులిచ్చుకొని ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దీంతో సొంత అభిమానులే హసన్ అలీపై తిట్ల దండకం మొదలుపెట్టారు. ''ఫోజులు తర్వాత ఇవ్వు.. ముందు నీ బౌలింగ్ ప్రదర్శనను మెరుగుపరుచుకో''.. ''ఈ ఫోజులకేం తక్కువ లేదు.. బౌలింగ్ బాగా చేస్తే మంచిది'' అంటూ చివాట్లు పెట్టారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే పెషావర్ జాల్మీ 12 పరుగుల తేడాతో ఇస్లామాబాద్ యునైటెడ్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ జాల్మీ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. బాబర్ ఆజం 64 పరుగులు చేయగా.. మహ్మద్ హారిస్ 34 పరుగులు చేశాడు. అనంతరం 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇస్లామాబాద్ యునైటెడ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 171 పరుగులు మాత్రమే చేసింది. షోయబ్ మక్సూద్ 60, అలెక్స్ హేల్స్ 57 పరుగులు చేశారు. Caption this? #HBLPSL8 | #SabSitarayHumaray | #IUvPZ pic.twitter.com/9MZM7BbE4Y — PakistanSuperLeague (@thePSLt20) March 16, 2023 Jalebia zyada bik gai inki shayad — Noor ul Ain (@thenoorulain13) March 16, 2023 -
షాహిన్ అఫ్రిది చితక్కొటినా తప్పని ఓటమి..
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2023లోలో డిఫెండింగ్ ఛాంపియన్స్ లాహోర్ ఖలండర్స్‌కు తొలి ఓటమి ఎదురైంది. మంగళవారం పెషావర్ జాల్మీతో జరిగిన మ్యాచ్‌లో లాహోర్ ఖలండర్స్ 35 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. జట్టు కెప్టెన్ షాహిన్ అఫ్రిది(36 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 52 పరుగులు), హుస్సేన్ తలత్(37 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 63) చితక్కొట్టినా ఓటమి నుంచి మాత్రం తప్పించలేకపోయారు. పెషావర్ జాల్మీ బౌలింగ్‌లో అర్షద్ ఇక్బాల్, వహాబ్ రియాజ్‌లు చెరో మూడు వికెట్లు తీయగా.. అజ్మతుల్లా రెండు వికెట్లు పడగొట్టాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ జాల్మీ 19.3 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు సయీమ్ అయూబ్(36 బంతుల్లో 68), కెప్టెన్ బాబర్ ఆజం(41 బంతుల్లో 50) రాణించారు. ఇక కొహ్లెర్ కాడ్మోర్ 16 బంతుల్లో 36 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. లాహోర్ ఖలండర్స్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది నాలుగు వికెట్లు పడగొట్టగా, హారిస్ రౌఫ్, జమాన్ ఖాన్, రషీద్ ఖాన్లు తలా రెండు వికెట్లు తీశారు. చదవండి: క్రికెట్లో కొత్త పంథా.. ఐపీఎల్ 2023 నుంచే మొదలు -
తొలి బంతికి బ్యాట్ రెండు ముక్కలైంది.. రెండో బంతికి వికెట్ ఎగిరిపడింది
PSL 2023: పాకిస్తాన్ సూపర్ లీగ్ 2023 సీజన్లో బ్యాట్‌కు బంతికి మధ్య భీకర పోరు నడుస్తోంది. లాహోర్ ఖలందర్స్-పెషావర్ జల్మీ జట్ల మధ్య నిన్న (ఫిబ్రవరి 26) జరిగిన మ్యాచ్‌లో ఈ పోరు పతాక స్థాయికి చేరింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ ఖలందర్స్.. ప్రత్యర్ధి బౌలర్లను ఓ రేంజ్లో ఆడుకోగా.. అనంతరం బరిలోకి దిగిన పెషావర్ జల్మీపై ఖలందర్స్ బౌలర్లు షాహీన్ అఫ్రిది (4-0-40-5), హరీస్ రౌఫ్ (4-0-38-1), జమాన్ ఖాన్ (3-0-28-2) నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడ్డాడు. బౌలర్లకు, బ్యాటర్లకు మధ్య జరిగిన ఈ భీకర పోరులో ఓ ఆసక్తికర విషయం అందరినీ ఆకట్టుకుంది. ఖలందర్స్ నిర్ధేశించిన 242 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన పెషావర్‌కు తొలి బంతికే షాహీన్ అఫ్రిది షాక్ ఇచ్చాడు. మెరుపు వేగంతో షాహీన్ సంధించిన బంతిని డ్రైవ్ చేసే క్రమంలో మహ్మద్ హరీస్ బ్యాట్ రెండు ముక్కలైంది. అనంతరం మరో బ్యాట్‌తో బ్యాటింగ్ కొనసాగించిన హరీస్‌ను షాహీన్ రెండో బంతికే క్లీన్ బౌల్డ్ చేశాడు. షాహీన్ సంధించిన వేగం ధాటికి ఆఫ్్ స్టంప్ గాల్లోకి పల్టీలు కొడుతూ నాట్యం చేసింది. చూడముచ్చటైన ఈ తంతుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. First ball: Bat broken ⚡ Second ball: Stumps rattled 🎯 PACE IS PACE, YAAR 🔥🔥#HBLPSL8 | #SabSitarayHumaray | #LQvPZ pic.twitter.com/VetxGXVZqY — PakistanSuperLeague (@thePSLt20) February 26, 2023 ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ ఖలందర్స్.. ఫకర్ జమాన్ (45 బంతుల్లో 96; 3 ఫోర్లు, 10 సిక్సర్లు), షఫీక్ (41 బంతుల్లో 75; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), సామ్ బిల్లింగ్స్ (23 బంతుల్లో 47 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంకర ఇన్నింగ్స్‌ల ధాటికి నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 241 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన పెషావర్ జల్మీ కూడా ఏమాత్రం తగ్గకుండా విజృంభించి ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదినప్పటికీ టార్గెట్ కొండంతలా ఉండటంతో 40 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. పెషావర్ బ్యాటర్లు సైమ్ అయూబ్ (34 బంతుల్లో 51; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), టామ్ కొహ్లెర్ కాడ్మోర్ (23 బంతుల్లో 55; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), భానుక రాజపక్ష (14 బంతుల్లో 24; 3 ఫోర్లు, సిక్స్), రోవమన్ పావెల్ (15 బంతుల్లో 20; 2 ఫోర్లు, సిక్స్), జేమ్స్ నీషమ్ (8 బంతుల్లో 12; సిక్స్), సాద్ మసూద్ (8 బంతుల్లో 16; 2 ఫోర్లు) పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పెషావర్ టీమ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేయగలిగింది. -
ఇంగ్లండ్ యువ ఆటగాడి విధ్వంసం.. సరిపోని ఇమాద్ వసీం మెరుపులు
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో మెరుపులు ప్రారంభమయ్యాయి. ఎనిమిదో సీజన్ తొలి మ్యాచ్‌లో ఫకర్ జమాన్ బ్లాస్టింగ్ హాఫ్ సెంచరీతో అదరగొట్టగా.. కరాచీ కింగ్స్‌తో నిన్న (ఫిబ్రవరి 14) జరిగిన మ్యాచ్‌లో పెషావర్ జల్మీ బ్యాటర్, ఇంగ్లండ్ యువ ఆటగాడు కొహ్లెర్ కాడ్మోర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్.. కొహ్లెర్ విధ్వంసకర హాఫ్ సెంచరీతో (50 బంతుల్లో 92; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోర్ చేసింది. కొహ్లెర్ మెరుపులకు, కెప్టెన్ బాబర్ ఆజమ్ బ్యాధ్యతాయుతమైన ఫిఫ్టీ తోడవ్వడంతో పెషావర్ భారీ స్కోర్ సాధించగలిగింది. కరాచీ బౌలర్లలో మీర్ హమ్జా, అండ్రూ టై, ఇమ్రాన్ తాహిర్, బెన్ కట్టింగ్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కరాచీ.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసి లక్ష్యానికి 3 పరుగుల దూరంలో నిలిచిపోయింది. కరాచీ కెప్టెన్ ఇమాద్ వసీం (47 బంతుల్లో 80 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీతో చేలరేగినప్పటికీ తన జట్టును గెలిపించుకోలేకపోయాడు. ఇమాద్‌కు వెటరన్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్ (34 బంతుల్లో 52; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్ధశతకం తోడైనప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఆఖరి ఓవర్లో కరాచీ గెలుపుకు 16 పరుగులు అవసరం కాగా.. ఇమాద్, బెన్ కట్టింగ్ (9) 13 పరుగులు చేయగలిగారు. ఆఖరి బంతిని ఇమాద్ భారీ సిక్సర్‌గా మలచినప్పటికీ అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. పెషావర్ బౌలర్లలో వాహబ్ రియాజ్, జేమ్స్ నీషమ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. సల్మాన్ ఇర్షాద్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. లీగ్‌లో ఇవాళ (ఫిబ్రవరి 15) ముల్తాన్ సుల్తాన్స్, క్వెట్టా గ్లాడియేటర్స్ తలపడనున్నాయి. -
మూడు సిక్సర్లతో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు.. ఫలితం సూపర్ ఓవర్
పాకిస్తాన్ స్టార్ బౌలర్ షాహిన్ అఫ్రిది బంతితోనే కాదు బ్యాట్‌తోను సత్తా చాటగలనని నిరూపించాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్‌కు దిగిన అఫ్రిది ఆఖరి ఓవర్లో మూడు సిక్సర్లతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. దీంతో ఫలితం సూపర్ ఓవర్ ద్వారా వచ్చింది. కానీ అఫ్రిదిని దురదృష్టం వెంటాడింది. సూపర్ ఓవర్లో తన జట్టు పరాజయం పాలైంది. పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్ 2022)లో భాగంగా పెషావర్ జాల్మి, లాహోర్ ఖలందర్స్ మధ్య మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ జాల్మి 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. హైదర్ అలీ 35, షోయబ్ మాలిక్ 32 పరుగులు సాధించారు. చదవండి: ఎంతైనా పాక్ క్రికెటర్ కదా.. ఆ మాత్రం ఉండాలి అనంతరం బ్యాటింగ్‌కు దిగిన లాహోర్ ఖలందర్స్ 96 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో మహ్మద్ హఫీజ్‌తో కలిసి కెప్టెన్ షాహిన్ అఫ్రిది కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఏడో వికెట్‌కు ఈ ఇద్దరు కలిసి 33 పరుగులు జోడించారు. కాగా 12 బంతుల్లో 30 పరుగుల చేయాల్సిన దశలో హఫీజ్ ఔటయ్యాడు. 19వ ఓవర్లో షాహిన్ ఒక ఫోర్ సహా మొత్తం ఆరు పరుగులు రాబట్టడంతో.. లాహోర్ ఖలందర్స్‌కు ఆఖరి ఓవర్లో విజయానికి 23 పరుగులు కావాలి. కాగా మహ్మద్ ఉమర్ వేసిన ఆఖరి ఓవర్లో తొలి బంతి వైడ్ వెళ్లింది. మరుసటి బంతిని బౌండరీ తరలించాడు. రెండో బంతిని అఫ్రిది సిక్సర్ కొట్టడంతో 4 బంతుల్లో 13 పరుగులుగా మారిపోయింది. మూడో బంతిని లాంగాఫ్ దిశగా భారీ సిక్సర్‌గా మలవడంతో రెండు బంతుల్లో ఏడు పరుగులు కావాలి. ఐదో బంతికి పరుగు రాలేదు. ఆఖరి బంతికి సిక్స్ కొడితే డ్రా.. లేదంటే ఓటమి. ఈ దశలో అఫ్రిది డీప్ మిడ్‌వికెట్ మీదుగా కళ్లు చెదిరే సిక్స్ కొట్టాడు. ఫలితం సూపర్ ఓవర్‌కు దారి తీసింది. కాగా 20 బంతుల్లో 3 సిక్సర్లు, 2 ఫోర్లతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన షాహిన్.. సెలబ్రేషన్స్‌లో భాగంగా మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదిని గుర్తుచేస్తూ ఫోజివ్వడం వైరల్‌గా మారింది. ఇక సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ ఖలందర్స్ ఐదు పరుగులు మాత్రమే చేయగలిగింది. పెషావర్ విజయానికి ఆరు పరుగులు మాత్రమే అవసరం. షోయబ్ మాలిక్ తొలి రెండు బంతులను ఫోర్‌గా మలచడంతో పెషావర్ జాల్మి విజయాన్ని అందుకుంది. చదవండి: నువ్వు ప్రపంచానికి కింగ్ కోహ్లివి కావొచ్చు.. కానీ నాకు మాత్రం THAT over. #HBLPSL7 l #LevelHai l #LQvPZ pic.twitter.com/o8AYrxjmNg — PakistanSuperLeague (@thePSLt20) February 21, 2022 -
ఎంతైనా పాక్ క్రికెటర్ కదా.. ఆ మాత్రం ఉండాలి
మ్యాచ్‌లో క్యాచ్ డ్రాప్ చేస్తే..'' ఏం కాదులే.. బౌండరీ వెళ్లకుండా ఆపావు అంటూ'' ఎంకరేజ్ చేసే బౌలర్లను చూసుంటాం.. లేదంటే క్యాచ్ వదిలేశాడన్న కోపంతో బౌలర్ సదరు ఆటగాడిని బూతులు తిట్టడం చూసుంటాం.. కానీ ఇక్కడ మనం చెప్పుకునే బౌలర్ అంతకుమించి అని చెప్పొచ్చు. క్యాచ్ డ్రాప్ చేశాడనే కోపంతో బౌలర్ ఏకంగా ఆటగాడికి చెంపదెబ్బను బహుమతిగా ఇచ్చాడు. ఎంతైనా పాక్ క్రికెటర్ కదా.. ఆ మాత్రం ఉండాలి. ఈ ఘటన పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో చోటుచేసుకుంది. సోమవారం పెషావర్ జాల్మి, లాహోర్ ఖలందర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. పెషావర్ ఇన్నింగ్స్ సమయంలో హారిస్ రౌఫ్ బౌలింగ్‌లో హజ్రతుల్లా జజయి పాయింట్ దిశగా ఆడాడు. అక్కడే ఉన్న కమ్రాన్ గులామ్ ఈజీ క్యాచ్‌ను అందుకోవడంలో విఫలమయ్యాడు. ఆ తర్వాత అదే ఓవర్ చివరి బంతికి హారిస్ రౌఫ్ మహ్మద్ హారిస్‌ను ఔట్ చేశాడు. మహ్మద్ హారిస్ ఫైన్‌లెగ్ దిశగా షాట్ ఆడగా.. పవాద్ అహ్మద్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో సెలబ్రేషన్స్‌లో మునిగిపోయిన హారిస్ రౌఫ్.. కమ్రాన్ గులామ్‌ను చూడాగానే క్యాచ్ వదిలేశాడన్న సంగతి గుర్తొచ్చినట్టుంది. చదవండి: Wriddiman Saha: బెదిరింపులు నిజమేనా?.. సాహాను వివరణ కోరనున్న బీసీసీఐ అంతే.. అందరూ చూస్తుండగానే హారిస్.. కమ్రాన్ గులామ్‌పై చేయి చేసుకొని పక్కకు నెట్టేశాడు. అయితే కమ్రాన్ దీనిని సీరియస్‌గా తీసుకోకుండా అభినందించగా.. హారిస్ మాత్రం అతన్ని సీరియస్‌గానే చూశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఉద్దేశపూర్వకంగానే హారిస్ రౌఫ్ తోటి ఆటగాడిపై చేయి చేసుకున్నట్లు తెలిసింది. దీంతో పీసీబీ హారిస్‌పై ఎటువంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక మ్యాచ్ ఫలితం సూపర్ ఓవర్ ద్వారా రావడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ జాల్మి 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన లాహోర్ ఖలందర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి సరిగ్గా 158 పరుగులు చేసింది. దీంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. ఇక సూపర్ ఓవర్లో పెషావర్ జాల్మీ విజయం సాధించింది. చదవండి: 2 ఓవర్లు.. 10 బంతుల్లో 5 వికెట్లు.. ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా! ఇక పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో(పీఎస్ఎల్ 2022) అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే అలెక్స్ హేల్స్, పాల్ స్ట్రింగ్‌లు వ్యక్తిగత కారణాలతో లీగ్‌కు దూరం కాగా.. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జేమ్స్ ఫాల్కనర్ ఆర్దికపరమైన సమస్యలతో లీగ్ నుంచి అర్థంతరంగా వైదొలిగాడు. తనకు ఇస్తానన్న డబ్బులు మొత్తం ఇవ్వకుండా మ్యాచ్‌లు ఆడించిందని.. పీఎస్ఎల్లో అంతా అవినీతే జరుగుతుందంటూ సంచలన ఆరోపణలు చేశాడు. అయితే పీసీబీ ఫాల్కనర్ వార్తల్లో నిజం లేదంటూ కొట్టిపారేసింది. Wreck-it-Rauf gets Haris! #HBLPSL7 l #LevelHai l #LQvPZ pic.twitter.com/wwczV5GliZ — PakistanSuperLeague (@thePSLt20) February 21, 2022 -
పాత గొడవను గుర్తుచేసి కౌంటర్ ఇద్దామనుకున్నాడు.. బెడిసికొట్టింది
పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్ 2022)లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఎప్పుడో నాలుగేళ్ల క్రితం తనకు చేసిన అవమానాన్ని గుర్తుతెచ్చుకున్న బ్యాట్స్‌మన్ సదరు బౌలర్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని భావించాడు. అయితే చివరికి ఆ ప్లాన్ తనకే బెడిసి కొట్టింది. ఆ బ్యాట్స్‌మన్ ఆస్ట్రేలియా డాషింగ్ ఆల్‌రౌండర్ బెన్ కటింగ్ అయితే.. బౌలర్ పాకిస్తాన్ క్రికెటర్ సోహైల్ తన్వీర్. చదవండి: IPL 2022 Auction: నన్నంటే కొనలేదు.. అతడిని కూడానా.. నిజంగా షాకయ్యా! విషయంలోకి వెళితే.. 2018లో కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో తన్వీర్ గయానా అమెజాన్ వారియర్స్ తరపున.. బెన్ కటింగ్ సెంట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియోట్స్ తరపున ప్రాతినిధ్యం వహించారు. కాగా బెన్ కటింగ్‌ను ఔట్ చేసిన తర్వాత సోహైల్ తన్వీర్ కటింగ్‌ను చూస్తూ తన రెండు చేతులతో మిడిల్ ఫింగర్ చూపించాడు. దీనిని బెన్ కటింగ్ నాలుగేళ్లుగా మనసులో పెట్టుకున్నాడని తాజా ఘటనతో అర్థమైంది. మంగళవారం రాత్రి పెషావర్ జాల్మీ, క్వెటా గ్లాడియేటర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. కాగా పెషావర్ జాల్మి ఇన్నింగ్స్ సమయంలో తన్వీర్ వేసిన 19వ ఓవర్లో బెన్ కటింగ్ మూడు సిక్సర్లతో హోరెత్తించాడు. ఆ తర్వాత తన్వీర్వైపు తిరిగి రెండు చేతులు పైకెత్తి మిడిల్ ఫింగర్ చూపించి నాలుగేళ్ల క్రితం తనకు జరిగిన అవమానాన్ని సరిచేశానని భావించాడు. ఇది ఇంతటితో ముగిసిపోలేదు. నసీమ్ షా వేసిన చివరి ఓవర్లో భారీ షాట్‌కు యత్నించి బెన్ కటింగ్ బ్యాక్వర్డ్ పాయింట్ వద్ద తన్వీర్కే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక తన్వీర్ ఊరుకుంటాడా.. వెంటనే తన రెండు చేతులు పైకెత్తి మిడిల్ ఫింగర్ చూపించి దెబ్బకు దెబ్బ తీశాడు. ఆ విధంగా తన్వీర్.. కటింగ్‌పై మరోసారి పైచేయి సాధించినట్లయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: IPL 2022: కేన్ మామ 'బకరా' అయ్యే అవకాశాలు ఎక్కువ.. ఇక మ్యాచ్‌లో పెషావర్ జాల్మి 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ జాల్మి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. షోయబ్ మాలిక్ 58, తలాత్ 51, బెన్ కటింగ్ 36 పరుగులు చేశాడు. క్వెటా గ్లాడియేటర్స్ బౌలింగ్‌లో నసీమ్ షా 4 వికెట్లు తీశాడు. కుర్రమ్ షెహజాద్, గులామ్ ముదస్సార్, ఇఫ్తికార్ అహ్మద్‌లు తలా ఒక వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన క్వెటా గ్లాడియేటర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. విల్ స్మీద్ 99 పరుగులు చేసి ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్సయ్యాడు. అయితా మిగతావారు పెద్దగా రాణించకపోవడంతో క్వెటా ఓటమిపాలైంది. The entire Sohail Tanvir vs Ben Cutting battle. From 2018 to 2022. pic.twitter.com/XuV18PyiZ3 — Haroon (@hazharoon) February 15, 2022 -
రెండుసార్లు ఆటగాడికి లైఫ్.. తొలిసారి టైటిల్ అందించాడు
అబుదాబి: అబుదాబి వేదికగా జరిగిన పాకిస్తాన్ సూపర్‌లీగ్(పీఎస్ఎల్-6) టైటిల్‌ను ముల్తాన్ సుల్తాన్స్ చేజెక్కించుకుంది. పెషావర్ జాల్మితో జరిగిన ఫైనల్లో ముల్తాన్ సుల్తాన్స్ 47 పరుగులతో విజయం సాధించి తొలిసారి పీఎస్ఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోరు చేసింది. కాగా మ్యాచ్‌లో రెండుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న మక్సూద్ 35 బంతుల్లో 65 పరుగులు నాటౌట్‌గా నిలిచి విజయంలో కీలకపాత్ర పోషించాడు. అతనికి రోసౌ 50 పరుగులతో ఆకట్టుకోగా.. మసూద్ 37, రిజ్వాన్ 30 పరుగులతో సహకరించారు. అనంతరం భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పెషావర్ జాల్మి ఏదశలోనూ ఆకట్టుకోలేకపోయింది. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులకు ఆలౌట్ అయింది. ఇమ్రాన్ తాహిర్ 3 వికెట్లతో ఆకట్టుకున్నాడు. పెషావర్ బ్యాటింగ్‌లో షోయబ్ మాలిక్ 48 పరుగలతో రాణించగా.. మిగతావారు పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక మక్సూద్.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌ను ఎగురేసుకుపోవడం విశేషం. గత నవంబర్‌లో కరోనా కారణంగా అర్థంతరంగా రద్దు చేసిన పీఎస్ఎల్-6ను అబుదాబి వేదికగా రీషెడ్యూల్ చేసి మ్యాచ్‌లను నిర్వహించిన సంగతి తెలిసిందే. చదవండి: PSL: ఒక్క ఓవర్లో 33 పరుగులు.. దెబ్బకు ప్లేఆఫ్ బెర్త్ -
ఉస్మాన్ ఖవాజా మెరుపు సెంచరీ.. 11 ఏళ్ల రికార్డు బద్దలు
అబుదాబి: పాకిస్తాన్ సూపర్‌లీగ్( పీఎస్ఎల్-6)లో భాగంగా గురువారం పెషావర్ జాల్మి, ఇస్లామాబాద్ యునైటెడ్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరిగింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్‌ను విజయం వరించింది. ఇస్లామాబాద్ ఆటగాడు ఉస్మాన్ ఖవాజా మెరుపు సెంచరీకి తోడు ఆసిఫ్ అలీ 14 బంతుల్లోనే 43 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. వీరికి తోడు కొలిన్ మున్రో 48, బ్రాండన్ కింగ్ 46 పరుగులతో రాణించడంతో ఇస్లామాబాద్ యునైటెడ్ 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన పెషావర్ జాల్మి ధీటుగానే బదులిచ్చింది. నిర్ణీత 20 ఓవర్ల ఆటలో 6 వికెట్లు నష్టపోయి 232 పరుగులు చేసి 15 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. షోయబ్ మాలిక్ 68, కమ్రాన్ అక్మల్ 53 పరుగులతో రాణించారు. ఇక పీఎస్ఎల్ చరిత్రలో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 200కు పైగా పరుగులు నమోదవ్వడం 11 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే. 2010లో కరాచీ డాల్ఫిన్స్, లాహోర్ ఈగల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 200కు పైగా స్కోర్లు నమోదు అయ్యాయి. ఈ విజయంతో ఇస్లామాబాద్ యునైటెడ్ 14 పాయింట్లతో టాప్ స్థానానికి ఎగబాకగా.. పెషావర్ జాల్మి 10 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. చదవండి: PSL: ఆటగాళ్ల బూతు పురాణం.. వీడియో -
రషీద్ పాంచ్ పటాకా.. టాప్‌లో లాహోర్ ఖలందర్స్
అబుదాబి: యూఏఈ వేదికగా జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్ 6)లో లాహోర్ ఖలందర్స్ వరుస విజయాలతో దూసుకెళ్తుంది. ఇస్లామాబాద్ యునైటెడ్‌పై బుధవారం థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసిన లాహోర్ గురువారం పెషావర్ జాల్మిపై 10 పరుగుల తేడాతో విజయం సాధించి మొత్తంగా 6 మ్యాచ్‌లాడి 5 విజయాలు.. ఒక ఓటమితో 10 పాయింట్లు సాధించి టేబుల్ టాపర్‌గా నిలిచింది. గత మ్యాచ్‌లో సూపర్ బ్యాటింగ్‌తో జట్టును గెలిపించిన స్పిన్నర్ రషీద్ ఖాన్ ఈసారి బౌలింగ్‌లో అదరగొట్టాడు. మ్యాచ్‌లో ఐదు కీలక వికెట్లు తీసి మరోసారి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. పీఎస్ఎల్లో ఐదు వికెట్లు తీయడం రషీద్‌కు ఇదే తొలిసారి. రషీద్ ఐదు వికెట్లు తీసిన వీడియోనూ పీఎస్ఎల్ తన ట్విటర్లో షేర్ చేసింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఖలందర్స్ 25 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ నేపథ్యంలో టిమ్ డేవిడ్ (36 బంతుల్లో 64, 3 ఫోర్లు, 5 సిక్సర్లు), బెన్ డంక్(33 బంతుల్లో 48, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించగా.. చివర్లో జేమ్స్ ఫాల్కనర్ 7 బంతుల్లో 22 పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 170 పరుగులు సాధించింది. అనంతరం 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పెషావర్ 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టానికి 160 పరుగులు చేసి 10 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. షోయబ్ మాలిక్ 73 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగతావారు ఎవరు పెద్దగా రాణించలేదు. చదవండి: దంచికొట్టిన రషీద్ ఖాన్.. ఆఖరి బంతికి విజయం 5️⃣ 🌟@rashidkhan_19 posted his career best figures in franchise cricket on a magical night of bowling. #HBLPSL6 | #MatchDikhao | #PZvLQ pic.twitter.com/rdkNi40jyB — PakistanSuperLeague (@thePSLt20) June 10, 2021 -
గాయంతో క్రీజులోకి.. కెప్టెన్ కీలక ఇన్నింగ్స్!
-
గాయంతో క్రీజులోకి.. కీలక ఇన్నింగ్స్!
షార్జా: గాయంతో బాధపడుతూ క్రీజులోకి దిగినా భారీ హిట్టింగ్తో జట్టును గెలిపించాడు పెషావర్ జల్మీ కెప్టెన్ డారెన్ స్యామీ. గురువారం సాయంత్రం జరిగిన ఉత్కంఠపోరులో క్వెట్టా గ్లాడియేటర్స్ జట్టుపై పెషావర్‌ను విజేతగా నిలిపాడు స్యామీ. గాయంతో ఉన్న స్యామీ ఏం ఆడతాడులే అనుకుంటే భారీ షాట్లతో ఏకంగా మ్యాచ్‌నే దూరం చేశాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో భాగంగా పెషావర్ జల్మీతో జరిగిన మ్యాచ్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లాడి 142 పరుగులు చేసి పెషావర్‌కు ఓ మోస్తరు లక్ష్యాన్ని నిర్ధేశించింది. 143 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన డారెన్ స్యామీ జట్టు తొలుత బాగానే పరుగులు సాధించినా చివర్లో ఒత్తిడికి లోనైంది. తమీమ్ ఇక్బాల్-మహ్మద్ హఫీజ్ లు 54 పరుగుల భాగస్వామ్యం అనంతరం పెషావర్ టీమ్ వికెట్ కోల్పోయింది. పరుగులు రాకపోవడం, వికెట్ పడటంతో స్యామీ సేన విజయానికి 7 బంతుల్లో 16 పరుగులు కావాలి. ఎడకాలికి గాయంతో బాధపడుతున్నా స్యామీ క్రీజులోకి వచ్చాడు. 19వ ఓవర్ చివరి బంతికి సిక్సర్ బాది పెషావర్‌లో ఆశలు నింపాడు. గ్లాడియేటర్ బౌలర్ అన్వర్ అలీ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్ రెండో బంతిని సిక్సర్‌గా మలిచిన స్యామీ, నాలుగో బంతిని లాంగాఫ్ దిశగా ఫోర్ కొట్టగానే సంబరాలు మొదలయ్యాయి. కేవలం 4 బంతులాడిన కెప్టెన్ స్యామీ 2 సిక్సర్లు, ఫోర్ బాది 16 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో పెషావర్ జల్మీ నాలుగో స్థానంలో నిలిచింది.