పాకిస్తాన్ సూపర్ లీగ్-2024లో పెషావర్ జల్మీ మరో ఓటమి చవిచూసింది. రావల్పిండి వేదికగా ఇస్లామాబాద్ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో 29 పరుగుల తేడాతో పెషావర్ ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో పెషావర్ ఓటమి పాలైనప్పటికి.. ఆ జట్టు యువ ఆల్‌రౌండర్ అమీర్ జమాల్ తన విరోచిత పోరాటంతో అందరని అకట్టుకున్నాడు. 197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పెషావర్ కేవలం 18 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లతు కష్టాల్లో పడింది.
ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన అమీర్ జమీల్ ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. మరో ఎండ్‌లో ఉన్న వాల్టర్‌తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. బౌండరీలు వర్షం కురిపించాడు. జమాల్ ఇన్నింగ్స్ చూసి పెషావర్ మరో విజయం తమ ఖాతాలో వేసుకుంటుందని అంతా భావించారు. కానీ ఆఖరిలో జమాల్ ఔట్ కావడంతో పెషావర్ ఓటమి చవిచూసింది.
ఓవరాల్‌గా 49 బంతులు ఎదుర్కొన్న జమాల్ 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 87 పరుగులు చేశాడు. ఏడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి సంచలన ఇన్నింగ్స్ ఆడిన జమాల్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా లక్ష్య ఛేదనలో పెషావర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 167 పరుగులకే పరిమితమైంది.
AAMER JAMAL PLAYING LIKE HE DID IN THE TESTS IN AUSTRALIA 🔥🔥🔥#HBLPSL9 #tapmad #HojaoAdFree pic.twitter.com/UeiRi24PSB
— Farid Khan (@_FaridKhan) March 4, 2024
ఇస్లామాబాద్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టగా.. రీస్, హునైన్ షా తలా రెండు వికెట్లు సాధించారు.ఇక అంతకముందు బ్యాటింగ్ చేసిన ఇస్లామాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఇస్లామాబాద్ బ్యాటర్లలో కెప్టెన్ షాదాబ్(51 బంతుల్లో 80, 4ఫోర్లు,6 సిక్స్‌లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు.
Aamer Jamal REMEMBER THE NAME !🤝#HBLPSL9 #IUvPZ #PSL2024
— Aussies Army🏏🦘 (@AussiesArmy) March 4, 2024
pic.twitter.com/7Dgqv69zTD
Comments
Please login to add a commentAdd a comment