సత్తా చాటిన బాబర్‌.. మరోసారి బ్యాట్‌ ఝులిపించిన ఆమెర్ | PSL 2024: Peshawar Zalmi Scored 204 For 5 Against Multan Sultans | Sakshi
Sakshi News home page

PSL 2024: సత్తా చాటిన బాబర్‌ ఆజమ్‌.. మరోసారి బ్యాట్‌ ఝులిపించిన ఆమెర్ జమాల్‌

Published Tue, Mar 5 2024 9:41 PM | Last Updated on Wed, Mar 6 2024 9:06 AM

PSL 2024: Peshawar Zalmi Scored 204 For 5 Against Multan Sultans - Sakshi

పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ 2024 ఎడిషన్‌లో పెషావర్‌ జల్మీ మరోసారి భారీ స్కోర్‌ సాధించింది. ముల్తాన్‌ సుల్తాన్స్‌తో ఇవాళ (మార్చి 5) జరుగుతున్న మ్యాచ్‌లో పెషావర్‌ టీమ్‌ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది.

టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన పెషావర్‌కు ఓపెనర్లు సైమ్‌ అయూబ్‌ (22 బంతుల్లో 46;3 ఫోర్లు, 5 సిక్సర్లు), బాబర్‌ ఆజమ్‌ (40 బంతుల్లో 64; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్ని అందించారు. వీరికి వికెట్‌కీపర్‌ హసీబుల్లా ఖాన్‌ (20 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్‌), రోవ్‌మన్‌ పావెల్‌ (15 బంతుల్లో 23 నాటౌట్‌; ఫోర్‌, 2 సిక్సర్లు), ఆసిఫ్‌ అలీ (10 బంతుల్లో 11; 2 ఫోర్లు) తోడయ్యారు.

ఆఖర్లో ఆమెర్‌ జమాల్‌ (5 బంతుల్లో 12 నాటౌట్‌; ఫోర్‌, సిక్స్‌) గత మ్యాచ్‌ తరహాలో (జమాల్‌ నిన్న ఇస్తామాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో పూనకం వచ్చినట్లు ఊగిపోయి 49 బంతుల్లో 8 ఫోర్లు, అర డజను సిక్సర్ల సాయంతో 87 పరుగులు చేశాడు) రెచ్చిపోయాడు. 

సుల్తాన్స్‌ బౌలర్లలో​ ఉసామా మిర్‌, క్రిస్‌ జోర్డన్‌లు పెషావర్‌ బ్యాటర్లకు అడ్డుకట్ట వేయగలిగారు. ఉసామా 4 ఓవర్లలో 32 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా.. జోర్డన్‌ 4 ఓవర్లలో 33 పరుగులిచ్చి 2 వికెట్లు దక్కించుకున్నాడు. వీరిద్దరు మినహా మిగతా బౌలర్లంతా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. మొహ్మద్‌ అలీ 3 ఓవర్లలో 46, డేవిడ్‌ విల్లే 4 ఓవర్లలో 36, ఇఫ్తికార్‌ ఓవర్‌లో 12, ఖుష్దిల్‌ షా ఓవర్‌లో 13, అఫ్తాబ్‌ 3 ఓవర్లలో 30 పరుగులు సమర్పించుకున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement