పాకిస్తాన్ సూపర్ లీగ్-2024లో పెషావర్ జల్మీ కథ ముగిసింది. ఈ లీగ్‌లో భాగంగా ఇస్లామాబాద్ యునైటెడ్‌తో జరిగిన ఎలిమినేటర్‌లో 5 వికెట్ల తేడాతో పెషావర్ ఓటమి పాలైంది. దీంతో ఈ లీగ్ నుంచి బాబర్ ఆజం సారథ్యంలోని పెషావర్ ఇంటిముఖం పట్టింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
జల్మీ బ్యాటర్లలో సైమ్ అయూబ్(44 బంతుల్లో 73,6 ఫోర్లు, 4 సిక్స్‌లు) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు మహ్మద్ హ్యారిస్(40) పరుగులతో రాణించాడు. ఇస్లామాబాద్ బౌలర్లలో నసీం షా 3 వికెట్లు పడగొట్టగా.. మెకాయ్, షాదాబ్ ఖాన్ తలా వికెట్ సాధించారు.
అనంతరం 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇస్లామాబాద్ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇస్లామాబాద్ బ్యాటర్లలో మిడిలార్డర్ బ్యాటర్లు ఇమాద్ వసీం(59 నాటౌట్), హైదర్ అలీ(52 నాటౌట్) పరుగులతో కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.
పెషావర్ బౌలర్లలో అయూబ్ రెండు వికెట్లు పడగొట్టగా.. వుడ్, ముమ్టాజ్, కుర్రామ్ తలా వికెట్ సాధించారు. ఇక మార్చి 18న కరాచీ వేదికగా జరగనున్న ఫైనల్లో ముల్తాన్ సుల్తాన్స్‌తో ఇస్లామాబాద్ యూనైటడ్ తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment