టీమిండియా హెడ్ కోచ్ పదవికి కోసం బీసీసీఐ దరఖాస్తులను అహ్హనించిన సంగతి తెలిసిందే. హెడ్ కోచ్ పదవిపై ఆసక్తి గల వారు తమ దరఖాస్తులను ఈ నెల 27. సాయంత్రం 6 గంటల్లోగా బీసీసీఐకి తమ దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది.
ఈ క్రమంలో రాహుల్ ద్రవిడ్ వారుసుడిగా పలు దిగ్గజాలు పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు చెన్నై సూపర్ కింగ్స్ హెడ్‌కోచ్, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్. భారత జట్టు హెడ్‌కోచ్ బాధ్యతలను ఎలాగైనా ఫ్లెమింగ్‌కు అప్పగించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కానీ ఫ్లెమింగ్ మాత్రం టీమిండియా హెడ్‌కోచ్ బాధ్యతలు చెపట్టేందుకు సిద్దంగా లేనిట్లు సమాచారం. 2027 వరకు ప్రపంచవ్యాప్తంగా పలు టీ20 ఫ్రాంచైజీలతో కోచ్‌గా అతడు ఒప్పందం కుదుర్చుకోవడమే ఇందుకు కారణం.
అయితే జస్టిన్ లాంగర్, గౌతమ్ గంభీర్, మహేల జయవర్ధనే వంటి ఇతర అభ్యర్థులతో బీసీసీఐ చర్చలు జరుపుతున్నప్పటికీ.. ఈ మాజీ న్యూజిలాండ్ క్రికెటర్‌ను ఒప్పించడంపై బోర్డు ఆసక్తిగా ఉంది.
ఈ క్రమంలో టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునేలా ఫ్లెమింగ్‌ను ఒప్పించే బాధ్యతను బీసీసీఐ.. సీఎస్‌కే మాజీ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి అప్పగించినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
"భారత హెడ్‌కోచ్ పదవి కోసం స్టీఫెన్ ఫ్లెమింగ్‌ను బీసీసీఐ సంప్రదించింది. అందుకు ఫ్లెమింగ్ నో చెప్పలేదు. కానీ అతడు ఫ్రాంచైజీలతో తన కాంట్రాక్ట్ పదవీకాలం గురించి ఆలోచిస్తున్నాడు. అయితే రాహుల్ ద్రవిడ్ కూడా తొలుత భారత హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు అంతగా ఆసక్తి చూపలేదు.
కానీ అతడిని ఒప్పించారు. ఇప్పుడు ఫ్లెమింగ్ విషయంలో కూడా అదే జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ బాధ్యతను ఎంఎస్ ధోనికి అప్పగించారు. ఎందుకంటే స్టీఫెన్‌తో ధోనికి మంచి సంబంధాలు ఉన్నాయని" ఓ బీసీసీఐ అధికారి ఒకరు హిందుస్థాన్ టైమ్స్‌తో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment