MaryKom
-
మేరీ పంచ్ అదిరె...
టోక్యో: భారత సీనియర్ బాక్సర్, 2012 ఒలింపిక్స్ కాంస్య పతక విజేత మేరీకోమ్ టోక్యోలో తొలి అడుగును విజయవంతంగా వేసింది. రెండో ఒలింపిక్ పతకాన్ని ఆశిస్తున్న భారత బాక్సింగ్ దిగ్గజం ఆదివారం జరిగిన 51 కేజీల విభాగం తొలి రౌండ్లో 4–1 తేడాతో మిగులినా హెర్నాండెజ్ (డొమినికన్ రిపబ్లిక్)ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన 38 ఏళ్ల మేరీకోమ్ ముందు 23 ఏళ్ల మిగులినా నిలవలేకపోయింది. తర్వాతి పోరులో కొలంబియాకు చెందిన మూడో సీడ్ ఇన్‌గ్రిట్ వలెన్సియాతో తలపడుతుంది. పురుషుల 63 కేజీలవిభాగంలో భారత బాక్సర్ మనీశ్ కౌశిక్‌కు చుక్కెదురైంది. తొలి పోరులోనే అతను ఓటమిపాలై నిష్క్రమించాడు. బ్రిటన్‌కు చెందిన ల్యూక్ మెక్‌కార్మాక్ 4–1తో మనీశ్‌ను ఓడించాడు. -
మేరీకోమ్‌కు పతకం ఖాయం
కాస్టెలాన్ (స్పెయిన్): ఏడాది విరామం తర్వాత బరిలోకి దిగిన తొలి అంతర్జాతీయ టోర్నమెంట్లో భారత మహిళా మేటి బాక్సర్ మేరీకోమ్ పతకాన్ని ఖాయం చేసుకుంది. బాక్సమ్ ఓపెన్ టోర్నీలో మేరీకోమ్ 51 కేజీల విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన మేరీకోమ్ బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ బౌట్లో ఇటలీకి చెందిన జియోర్డానా సొరెన్టినోపై గెలిచింది. సెమీఫైనల్లో అమెరికా బాక్సర్ వర్జీనియాతో మేరీకోమ్ ఆడనుంది. పురుషుల విభాగంలో మనీశ్ (63 కేజీలు) క్వార్టర్ ఫైనల్ చేరాడు. తొలి రౌండ్లో మనీశ్ 5–0తో రడుయెన్ (స్పెయిన్)పై నెగ్గాడు. -
ఇటలీ పర్యటనకు మేరీకోమ్ దూరం
న్యూఢిల్లీ: భారత బాక్సర్ల టోక్యో ఒలింపిక్స్ సన్నాహాలు మొదలు కానున్నాయి. నాణ్యమైన ప్రాక్టీస్ కోసం బాక్సర్లను ఇటలీ పంపించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మొత్తం 28 మందితో కూడిన భారత బృందాన్ని ఎంపిక చేసింది. 10 మంది పురుషులు, ఆరుగురు మహిళా బాక్సర్లతో పాటు సహాయ సిబ్బంది వచ్చే వారం ఇటలీకి ప్రయాణం కానున్నారు. ఈ మేరకు 52 రోజుల శిక్షణకు అవసరమయ్యే రూ. 1.31 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. అక్టోబర్ 15 నుంచి డిసెంబర్ 5 వరకు ఇటలీలోని అసిసి నగరంలో జరిగే ఈ శిబిరానికి దిగ్గజ మహిళా బాక్సర్ మేరీకోమ్‌తోపాటు మరో ఇద్దరు బాక్సర్లు పాల్గొనడం లేదు. డెంగ్యూ కారణంగా మేరీకోమ్, గాయం నుంచి కోలుకుంటోన్న మనీశ్ కౌశిక్ (63 కేజీలు) ... అమెరికాలో ప్రాక్టీస్ చేస్తోన్న కారణంగా వికాస్ (69 కేజీలు) ఈ పర్యటనకు గైర్హాజరు కానున్నారు. అనారోగ్యం తగ్గాక ఢిల్లీలోనే ప్రాక్టీస్ చేస్తానని మేరీకోమ్ చెప్పింది. ‘డెంగ్యూతో బాధపడుతున్నా. ఇప్పుడు బాగానే ఉన్నప్పటికీ ప్రయాణించే ఉద్దేశం లేదు. వచ్చే ఏడాది విదేశాలకు వెళ్లడం గురించి ఆలోచిస్తా. ప్రస్తుతానికి ఢిల్లీలోనే ప్రాక్టీస్ చేస్తా’ అని మేరీ తెలిపింది. ఒలింపిక్స్ పతకావకాశాలున్న అమిత్ పంఘాల్ (52 కేజీలు), ఆశిష్ (75 కేజీలు), సతీశ్ (ప్లస్ 91 కేజీలు), సిమ్రన్ (60 కేజీలు), లవ్లీనా (69 కేజీలు), పూజా రాణి (75 కేజీలు) ఈ పర్యటనను వినియోగించుకోనున్నారు. -
ఆరో స్వర్ణం మేరీ సొంతం
న్యూఢిల్లీ: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ పంచ్‌కు ఎదురు లేకుండా పోయింది. శనివారం జరిగిన 48 కేజీల విభాగం ఫైనల్లో ఉక్రెయిన్‌కు చెందిన హనా ఒఖోటాను 5-0తో మట్టి కరిపించింది. మేరీ పంచ్‌ల ముందు ప్రత్యర్థి ఏమాత్రం నిలవలేకపోవడంతో ఫలితం ఏకపక్షంగా వచ్చింది. దీంతో ఆరు స్వర్ణాలు నెగ్గిన తొలి మహిళా బాక్సర్‌గా ఈ మణిపురి మణిపూస చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు చాంపియన్‌షిప్‌లో ఆరు పతకాలతో ఐర్లాండ్‌కు చెందిన కేటీ టేలర్ (5 స్వర్ణాలు, 1 కాంస్యం)తో సమంగా ఉన్న మేరీకోమ్ ఇప్పుడు ఆమెను అధిగమించింది. తాజా స్వర్ణంతో ఆమె క్యూబా పురుషుల బాక్సింగ్ దిగ్గజం ఫెలిక్స్ సవాన్ సరసన చేరింది. మేరీ 2002, 2005, 2006, 2008, 2010 బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణాలతో పాటు.. అరంగేట్ర 2001 చాంపియన్ షిప్లో రజతం సాధించింది. గెలుపునంతరం ఆమె భావోద్వేగానికి గురైంది. ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకోలేకపోయింది. గత కొన్నేళ్లుగా తనకు మద్దతుగా నిలుస్తున్న అభిమానులకు ఆమె ధన్యవాదాలు తెలిపింది. ఈ పతకాన్ని దేశానికి అంకితమిచ్చింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడమే తన లక్ష్యంగా పేర్కొంది. వైఎస్ జగన్ అభినందనలు.. ఆరు స్వర్ణాలతో ప్రపంచ రికార్టు సృష్టించిన మేరికోమ్‌కు ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. -
మేరీ... ఆరో స్వర్ణంపై గురి
న్యూఢిల్లీ: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో మేరీకోమ్ పంచ్‌కు ఎదురు లేకుండా పోయింది. గతంలో ఐదు సార్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి, ఒకసారి రెండో స్థానం అందుకున్న ఈ మణిపురి మణిపూస ఆరోసారి శిఖరాన నిలిచేందుకు మరింత చేరువైంది. 35 ఏళ్ల మేరీకోమ్ గురువారం ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. 48 కేజీల విభాగం సెమీఫైనల్లో మేరీ 5–0తో కిమ్ హ్యాంగ్ మి (ఉత్తర కొరియా)ను చిత్తుగా ఓడించింది. మేరీ పంచ్‌ల ముందు ప్రత్యర్థి ఏమాత్రం నిలవలేకపోవడంతో ఫలితం ఏకపక్షంగా వచ్చింది. బౌట్‌ను పర్యవేక్షించిన ఐదుగురు జడ్జిలు మేరీకోమ్‌కు అనుకూలంగా 29–28, 30–27, 30–27, 30–27, 30–27 పాయింట్లు ఇవ్వడం భారత స్టార్ బాక్సర్ ఆధిపత్యానికి అద్దం పట్టింది. ఈ మెగా టోర్నీకి ముందు వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఆరు పతకాలతో ఐర్లాండ్‌కు చెందిన కేటీ టేలర్ (5 స్వర్ణాలు, 1 కాంస్యం)తో సమంగా ఉన్న మేరీకోమ్ ఇప్పుడు ఆమెను అధిగమించనుంది. ఫైనలో పోరులో నెగ్గి స్వర్ణం సాధిస్తే ఓవరాల్‌గా ఆరు బంగారు పతకాలతో ఆమె క్యూబా పురుషుల బాక్సింగ్ దిగ్గజం ఫెలిక్స్ సవాన్ సరసన చేరుతుంది. శనివారం జరిగే ఫైనల్లో మేరీ కోమ్... ఉక్రెయిన్‌కు చెందిన హనా ఒఖోటాతో తలపడుతుంది. ఈ ఏడాది పోలాండ్‌లో జరిగిన టోర్నీలో ఆమెను మేరీ ఓడించింది. 69 కేజీల విభాగంలో భారత్‌కు చెందిన లవ్లీనా బొర్గోహైన్ పోరాటం ముగిసింది. అస్సాంకు చెందిన 21 ఏళ్ల లవ్లీనా సెమీఫైనల్లో 0–4తో చెన్ నియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయి కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. ఐదుగురు జడ్జిల్లో నలుగురు 29–27, 29–27, 29–27, 30–26తో చెన్ నియెన్ చెన్ వైపు మొగ్గగా... మరొకరు ఇద్దరికి 28–28తో సమంగా పాయింట్లు ఇచ్చారు. నేడు జరిగే సెమీఫైనల్స్‌లో భారత బాక్సర్లు సోనియా చహల్ (57 కేజీలు), సిమ్రన్‌జిత్ కౌర్ (64 కేజీలు) బరిలోకి దిగనున్నారు. జో సన్ హవా (ఉత్తర కొరియా)తో సోనియా; డాన్ (చైనా)తో సిమ్రన్‌జిత్ తలపడతారు. సెమీస్‌లో నాతో తలపడిన కిమ్ హ్యాంగ్‌ను గత ఏడాది ఆసియా చాంపియన్‌షిప్‌లో కూడా ఓడించాను. కాబట్టి ఈ సారి కూడా నాటి విజయాన్ని నిలబెట్టుకునేందుకు మరింత సన్నద్ధతతో వచ్చాను. ప్రత్యర్థి నాకంటే పొడగరి. దాని వల్ల ఆమెకు కొన్ని అనుకూలతలు ఉన్నాయి. అయితే ఒక్కసారి బరిలోకి దిగానంటే దాని గురించి ఆలోచించకుండా నా ఆటపైనే దృష్టి పెడతా. ఫైనల్ చేరడం సంతోషంగా ఉంది. తుది పోరులో తలపడబోతున్న హనాపై కూడా ఇటీవలే గెలిచాను. సరైన వ్యూహంతో బరిలోకి దిగి మళ్లీ ఆమెను ఓడిస్తాననే నమ్మకముంది. –మేరీకోమ్ -
జాతీయ పరిశీలకురాలి పదవికి మేరీకోమ్ రాజీనామా
భారత దిగ్గజ మహిళా బాక్సర్ మేరీకోమ్ ‘భారత బాక్సింగ్ జాతీయ పరిశీలకురాలు’ (నేషనల్ అబ్జర్వర్) పదవికి రాజీనామా చేసినట్లు వెల్లడించింది. కేంద్ర క్రీడా శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్‌తో చర్చించిన తర్వాతే పదవిని విడిచిపెట్టినట్లు పేర్కొంది. పరస్పర విరుద్ద ప్రయోజనాల (కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్) దృష్ట్యా ప్రస్తుతం కెరీర్ కొనసాగిస్తున్న అథ్లెట్లు ఈ పదవిలో ఉండరాదని కేంద్ర క్రీడాశాఖ పేర్కొన్న నేపథ్యంలో మేరీకోమ్ ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పింది. -
ధోని సతీమణి ట్వీట్ వివాదం కానుందా?
ముంబై: భారతీయ సినిమా పరిశ్రమలో క్రీడాకారులు జీవిత కథా చిత్రాల(బయోపిక్) హవా కొనసాగుతోంది. అథ్లెట్ మిల్కాసింగ్ జీవిత కథ ఆధారంగా భాగ్ మిల్కా భాగ్, బాక్సింగ్ ఛాంపియన్ జీవిత కథ ఆధారంగా మేరి కోమ్ చిత్రాలు రూపొందడమే కాకుండా వాణిజ్య పరంగా కూడా మంచి సక్సెస్ ను సాధించాయి. ఆ చిత్రాలు అందించిన స్పూర్తితో క్రికెటర్, భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కథ తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన వివారాల్ని, పోస్టర్ ను కెప్టెన్ ధోని సతీమణి సాక్షి ధోని ట్విటర్ లో పోస్ట్ చేశారు. ఈ చిత్రం పేరు 'ఎంఎస్ ధోని- ది అన్ టోల్డ్ స్టోరి' అని వెల్లడించారు. గత కొద్దిరోజులుగా వస్తున్న రూమర్లకు తెరదించే ప్రయత్నం చేద్దాం. రూమర్లలో వాస్తవం లేదు అని ట్విట్ చేశారు. ధోని పాత్రను బాలీవుడ్ నటుడు, శుద్ధ్ దేశి రొమాన్స్ చిత్ర హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పోషిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్ లో ధోని ఆడుతుండగా ఆయన జీవిత కథను తెరకెక్కించడాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అనుమతించకపోవడం కొంత వివాదంగా మారింది. కాని తాజాగా ధోని చిత్ర పోస్టర్ ను సాక్షి సింగ్ ధోని ట్విటర్ లో పోస్ట్ చేయడం గమనార్హం. ఈ అంశాన్ని బీసీసీఐ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. Clearing out all those rumours being carried out past few days.It was all false.. Here you go ....BOOM !!! pic.twitter.com/58vXAGe3Bc — Sakshi Singh Dhoni (@SaakshiSRawat) September 24, 2014