
కాస్టెలాన్ (స్పెయిన్): ఏడాది విరామం తర్వాత బరిలోకి దిగిన తొలి అంతర్జాతీయ టోర్నమెంట్‌లో భారత మహిళా మేటి బాక్సర్ మేరీకోమ్ పతకాన్ని ఖాయం చేసుకుంది. బాక్సమ్ ఓపెన్ టోర్నీలో మేరీకోమ్ 51 కేజీల విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన మేరీకోమ్ బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ బౌట్‌లో ఇటలీకి చెందిన జియోర్డానా సొరెన్‌టినోపై గెలిచింది. సెమీఫైనల్లో అమెరికా బాక్సర్ వర్జీనియాతో మేరీకోమ్ ఆడనుంది. పురుషుల విభాగంలో మనీశ్ (63 కేజీలు) క్వార్టర్ ఫైనల్ చేరాడు. తొలి రౌండ్‌లో మనీశ్ 5–0తో రడుయెన్ (స్పెయిన్)పై నెగ్గాడు.
Comments
Please login to add a commentAdd a comment