
‘మీ కుటుంబంతో గడిపిన క్షణాలు అత్యద్భుతం. మాకు ఆతిథ్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు మహీ భాయ్- సాక్షి’ అంటూ సింగర్, ‘అల్లా వే’ ఫేం జేసీ గిల్ టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని కుటుంబంతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది తనకు, తన గ్యాంగ్‌కు మరిచిపోలేని ట్రిప్ అని పేర్కొన్నాడు. ఈ ఫొటోలు ప్రస్తుతం అభిమానులను ఆకర్షిస్తున్నాయి. కాగా పంజాబీలో ప్రముఖ గాయకుడిగా పేరు తెచ్చుకున్న జైసీ గిల్ పూర్తి పేరు జస్దీప్ సింగ్ గిల్. తన గాత్రంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న గిల్‌కు ధోని కుటుంబంతో అనుబంధం ఉంది. ఇటీవలే 31 వసంతంలోకి అడుగుపెట్టిన గిల్.. తన బర్త్‌డే ఫొటోలను కూడా అభిమానులతో పంచుకున్నాడు. ఇందులో ధోని భార్య సాక్షిధోని కూడా ఉండటం విశేషం.
కాగా ప్రస్తుతం క్రికెట్‌కు దూరంగా ఉన్న ధోని కుటుంబంతో సరదాగా గడుపుతున్నాడు. ఇక వన్డే ప్రపంచ కప్ నుంచి టీమిండియా నిష్క్రమణ నాటి నుంచి ధోని కెరీర్‌పై సందిగ్ధత కొనసాగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. ధోని ఆటకు రిటైర్మెంట్ ప్రకటిస్తాడా లేదా క్రికెటర్‌గా కొనసాగుతాడా అనే అంశంలో ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు. ఈ క్రమంలో ధోని మొదటిసారి స్వయంగా గురువారం స్పందించాడు. అది కూడా ఏకవాక్యంలోనే! క్రికెట్‌లో పునరాగమనం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ...‘జనవరి వరకు నన్నేమీ అడగొద్దు’ అని తేల్చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment