బీసీసీఐ షేర్ చేసిన ఫొటో
హైదరాబాద్ : టీ20 ప్రపంచకప్.. వన్డేప్రపంచకప్.. చాంపియన్స్ ట్రోఫి..అన్ని ఫార్మాట్లలో నెంబర్ వన్. దాదాపు క్రికెట్లో ఉన్న టైటిల్లన్నీ అందించిన ఏకైక సారథి.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. ఈ దిగ్గజ క్రికెటర్ నేడు 37వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. అంతే భారత క్రికెట్ నియంత్రంణ మండలి (బీసీసీఐ) అతని బర్త్‌డే సందర్భంగా ఓ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ‘స్పెషల్ విషెస్ ఫర్ ఏ స్పెషల్ మ్యాన్’ అంటూ ఓ వీడియోతో శుభాకాంక్షలు తెలిపింది.
అయితే ఈ వీడియోలో ధోని కూతరు జీవాతో విషెస్ చెప్పించడం ప్రత్యేకం. ‘ఐ లవ్ వ్యూ పప్పా హ్యాపీ బర్త్ డే అంటూ’... అంటూ సరదాగా జీవా విషెస్ చెప్పింది. జీవాతో పాటు టీమిండియా ఆటగాళ్లు కోహ్లి, రోహిత్, ధావన్, కార్తీక్, హార్ధిక్ పాండ్యా, కుల్దీప్‌లు ఈ జార్ఖండ్ డైనమైట్‌కు విషెస్ తెలియజేశారు. అతనితో ఉన్న మధుర క్షణాలను నెమరవేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఇంకేందుకు ఆలస్యం మీరు చూసేయండి!
Comments
Please login to add a commentAdd a comment