రాంచీ : టెస్ట్ సిరీస్‌తో ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లిసేన బిజీగా ఉండటంతో మాజీ కెప్టెన్, సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని తనకు లభించిన విరామాన్ని కుటుంబంతో ఆస్వాదిస్తున్నాడు. పెళ్లి విందులు.. బర్త్‌డే పార్టీలు, షాపింగ్‌లతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే తాజాగా ఓ చిన్నారితో ధోని ముద్దుగా ముచ్చటించిన వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తుంది. ఆ చిన్నారిని ఆప్యాయంగా దగ్గరుకు తీసుకుని మరి ఎత్తుకున్న ధోని.. ‘మీరు ఎక్కడ ఉంటారని ఆ పాప ముద్దుగా అడిగిన ప్రశ్నకు.. నేను బస్సులో ఉంటాను. నాకు ఇల్లు లేదు’ అని సమాధానం ఇచ్చాడు.
ఈ వీడియోను ధోని సతీమణి సాక్షిసింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అయింది. ధోనికి ఇల్లు అవసరం లేదని.. అతన్ని గుండెల్లో ఉంచుకున్నామని అతని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇక ధోని ఇటీవల తన కూతురు జీవాతో కలిసి డ్యాన్స్ చేసే వీడియో కూడా వైరల్ అయింది. ఈ వీడియోలో జీవా ధోనికి డ్యాన్స్ నేర్పించడం గమనార్హం. విరామం దొరికితే సతీమణి సాక్షిసింగ్, కూతురు జీవాలతో గడిపే ధోని ఈ సారి కూడా తన పూర్తి సమయాన్ని వారికే కేటాయించాడు. దీంతో వీరు ఏది చేసినా నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. జనవరి12న ఆసీస్‌తో ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌తోనే ఈ రాంచీ క్రికెటర్ తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment