వైరల్‌ : ధోని ఫన్‌ టైం విత్‌ ఫ్యామిలీ.! | MS Dhoni Enjoys Break From Cricket Shares Beautiful Video With Family | Sakshi
Sakshi News home page

Published Tue, Mar 13 2018 5:27 PM | Last Updated on Tue, Mar 13 2018 6:27 PM

MS Dhoni Enjoys Break From Cricket Shares Beautiful Video With Family - Sakshi

కుటుంబంతో ఎంఎస్‌ ధోని

సాక్షి, స్పోర్ట్స్‌ : టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్‌ చే‍స్తోంది. శ్రీలంకలో జరుగుతున్న ట్రై సిరీస్‌ నుంచి ధోనికి విశ్రాంతి లభించిన విషయం తెలిసిందే. అయితే ఈ విలువైన సమయాన్ని ఈ సీనియర్‌ క్రికెటర్‌ కుటుంబంతో ఆస్వాదిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తన సతీమణి సాక్షి, కూతురు జీవాతో గడిపిన మధుర క్షణాలకు సంబంధించిన ఓ వీడియోను ధోని తన ఇన్‌స్టాగ్రాంలో ‘ఫన్‌ టైం విత్‌ ఫ్యామిలీ’  అనే క్యాఫ్షన్‌తో పంచుకున్నాడు. అయితే ఈ వీడియోలో తన పెంపుడు కుక్కలు కూడా ఉన్నాయి. కుక్కలంటే ధోనికి ఎంతో ఇష్టమనే విషయం అందరికి తెలిసిందే.

ధోనీ పోస్టు చేసిన ఈ వీడియోకు ఇప్పటికే ఒక మిలియన్‌ వ్యూస్‌ వచ్చాయి.  ఇక మరోవైపు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సైతం తన విశ్రాంతి సమయాన్ని సతీమణి అనుష్కశర్మతో ఆస్వాదిస్తున్నాడు. వీటికి సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్న విషయం తెలిసిందే. ఈ స్టార్‌ క్రికెటర్లకు మైదానానికి దూరమైనా వ్యక్తిగత ఆనంద క్షణాలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.

ఐపీఎల్‌ నిర్వాహకులు సోమవారం విడుదల చేసిన ప్రచార గీతాన్ని కూడా ధోనీ తన ట్విటర్‌లో పంచుకున్నాడు. రెండేళ్ల నిషేధం తర్వాత చెన్నై సూపర్‌కింగ్స్‌ ఈ సీజన్‌ ఐపీఎల్‌లో పునరాగమనం చేయనుంది. ఏప్రిల్‌ 7న ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ డిపెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement