సాక్షి, హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గారాలపట్టి జీవా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇప్పటికే సెలబ్రిటీ స్టేటస్ సాధించిన ఈ చిన్నారి.. ఏం చేసినా అది కాస్త నెట్టింట్లో సెన్సేషన్ అవుతోంది.
కొద్ది రోజుల క్రితమే మళయాళం సాంగ్ ‘అంబాలపుజాయ్ ఉన్నికన్నానోడు నీ’ పాడిన వీడియో వైరల్ కాగా.. తాజాగా తన బుజ్జి బుజ్జి చేతులతో గుండ్రటి రోటీ చేసిన వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. జీవా సింగ్ ధోని పేరిట ఇన్‌స్టాగ్రమ్ ఖాతాను తెరిచిన ధోని దంపతులు.. జీవాకు సంబంధించిన ప్రతీ వీడియోలను ఈ ఇన్‌స్టాగ్రమ్ ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment