
డెహ్రాడూన్ : టీమిండియా మాజీ కెప్టెన్.. మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని మంచు కొండల్లో కుటుంబంతో కలిసి విహరిస్తున్నాడు. అటు క్రికెట్‌కు ఇటు కుటుంబంతో గడపడానికి సమ ప్రాధాన్యమిచ్చే ధోని.. తాజాగా డెహ్రాడూన్ యాత్రకు వెళ్లాడు. తన అద్భుతమైన ఆటతోనే కాకుండా.. కూతురు చిన్నారి జీవాతో ఆడుకుంటున్న వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుని అభిమానులను అలరిస్తుంటాడు ధోని. ఇక డెహ్రాడూన్‌లో.. కూతురు జీవా మంచు మనిషిని రూపొందిస్తుండగా.. ఆమెకు సాయం చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను ధోని అభిమానుల గ్రూప్ ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఈ వీడియో వైరల్ అయింది. ప్రపంచకప్ ముగిసిన అనంతరం ధోని ఆటకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ తండ్రీ కూతుళ్ల అనుబంధంపై సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది. ‘ధోని సూపర్ డాడ్’ అంటూ కొందరు ప్రశంసిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment