
ముంబై: టీమిండియా క్రికెటర్ ఎంఎస్ ధోని అంటే తనకు చాలా ఇష్టమని అంటున్నారు బాలీవుడ్ నటి సన్నీ లియోన్. ఓ కార్యక్రమంలో ‘మీకు ఇష్టమైన క్రికెటర్ ఎవరు?’ అని విలేకరి అడిగిన ప్రశ్నకు ధోని పేరు చెప్పారు సన్నీ. ఎందుకు? అని అడగ్గా.. ధోని ఫ్యామిలీ పర్సన్ అని ఆయనలో తనకు నచ్చే విషయం అదేనని తెలిపారు. వృత్తి పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబం కోసం ఏదో రకంగా సమయం కేటాయించుకుంటారని సన్నీ లియోన్ పేర్కొన్నారు.
కుమార్తె జీవాతో కలిసి దిగే ఫొటోలంటే తనకు చాలా ఇష్టమని, చాలా క్యూట్‌గా ఉంటాయని పేర్కొన్నారు. చివరిగా ‘తేరా ఇంత్‌జార్’ అనే చిత్రంతో సన్నీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 2017లో విడుదలైన ఆ సినిమాలో అర్బజ్ ఖాన్‌తో కలిసి సన్నీ నటించారు. ప్రస్తుతం ఆమె మళయాళం సినిమా ‘రంగీలా’ తో పాటు తమిళ సినిమా ‘వీరమదేవి’లో నటించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment