ఎంఎస్ ధోని, జీవా
న్యూఢిల్లీ : ఐపీఎల్ వచ్చిందంటే చాలు భారత సీనియర్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని అభిమానులకు పండుగే పండుగ. మైదానంలో ధోని అలరిస్తే.. ప్రేక్షకుల గ్యాలరీలో అతని కూతురు జీవా తన అల్లరితో ఆకట్టుకుంటోంది. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి అయిపోయే వరకు ఆమె గురించి సోషల్ మీడియా ముచ్చటించాల్సిందే.. టీవీ చానళ్లు, వెబ్‌సైట్స్ వార్తలు రాయాల్సిందే. మొన్న ఆరు భాషల్లో సమాధానం చెప్పి అబ్బుర పరిచిన జీవా.. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చేసిన అల్లరితో మరోసారి వార్తల్లో నిలిచింది.
చదవండి : ఆరు భాషల్లో అదరగొడుతున్న జీవా
ధోని బ్యాటింగ్ చేస్తుండగా గ్యాలరీలో ఉన్న జీవా.. ‘పప్పా.. కమాన్ పప్పా’ అని బిగ్గరగా అరుస్తూ తండ్రిని ప్రోత్సహించింది. ఈ వీడియోను చెన్నైసూపర్ కింగ్స్ తన అధికారిక ట్విటర్‌లో పంచుకోగా తెగ వైరల్ అయింది. ఇక ఈ మ్యాచ్‌లో చెన్నై 6 వికెట్లతో ఘనవిజయం సొంతం చేసుకుంది. క్లిష్ట పరిస్థితుల్లో ధోని(35 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), జాదవ్ (34 బంతుల్లో 27; 2 ఫోర్లు) నాలుగో వికెట్‌కు 54 బంతుల్లో 48 పరుగులు జోడించి జట్టును గెలిపించారు.
చదవండి : ఢిల్లీలోనూ ‘సూపర్ కింగ్స్’
Comments
Please login to add a commentAdd a comment