
Photo: IPL/BCCI
చెన్నై విజయం కోసం ప్రార్థించిన జీవా.. ఫొటో వైరల్
Ziva Singh Dhoni Praying For CSK Win Against DC Goes Viral: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్‌కింగ్స్ సారథి ఎంఎస్ ధోని కుమార్తె జీవా ధోని సింగ్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జీవా స్టేడియంలో కనిపిస్తే చాలు కెమెరాలన్నీ తన వైపే తిరుగుతాయి. తన చిలిపి చేష్టలు, మైదానంలో ఉన్న తండ్రిని ఉత్సాహపరుస్తున్న దృశ్యాలను ఒడిసిపడతాయి. ప్రస్తుతం జీవా ధోనికి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఐపీఎల్-2021 రెండో అంచెలో భాగంగా... చెన్నై సూపర్‌కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య సోమవారం మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. తండ్రి ఆటను చూడటానికి తల్లి సాక్షితో కలిసి జీవా స్టేడియానికి వచ్చింది. చెన్నై విజిల్ పొడూ అంటూ ఉత్సాహపరిచేందుకు వీలుగా విజిల్ కూడా వెంట తెచ్చుకుంది. కానీ, ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే ఇన్నింగ్స్ సాఫీగా సాగలేదన్న సంగతి తెలిసిందే.
ముఖ్యంగా ధోని స్లో బ్యాటింగ్ అభిమానులను నిరాశపరిచింది. ఈ క్రమంలో రెండు చేతులు జోడించి కళ్లు మూసుకుని దేవుడిని ప్రార్థిస్తున్నట్లుగా ఉన్న జీవా ఫొటో వైరల్ అవుతోంది. ‘‘అయ్యో పాపం జీవా... డాడీ జట్టు ఓడిపోయింది. మరేం పర్లేదు.. నీ ప్రార్థనలు ఫలించి... ఫైనల్ మ్యాచ్‌లో గెలుస్తారులే’’ అంటూ అభిమానులు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో ధోని సేన 3 వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
స్కోర్లు: చెన్నై సూపర్‌కింగ్స్- 136/5 (20)
ఢిల్లీ క్యాపిటల్స్- 139/7 (19.4)
Cute, Ziva Praying for CSK win ❤️#IPL2021 #DCvCSK pic.twitter.com/P5ZwB1al6M
— Thyview (@Thyview) October 4, 2021