
చెన్నై: ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌లో టీమిండియా బిజీగా ఉంటే... మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని మాత్రం భారత్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. మరో 10 రోజుల తరువాత వన్డేలు, టీ20లు ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లనున్న ధోని.. తాజాగా చెన్నై బీచ్‌లో సందడి చేశాడు. తన కుటుంబంతో సహా వచ్చిన ధోని.. కూతురు జీవాతో కలిసి మెరీనా బీచ్‌లో కనిపించి, అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అంతే కాకుండా అక్కడి ఇసుకలో గూళ్లు కట్టాడు. సొరంగం లాంటి గొయ్యి తీయడమే కాకుండాఅందులోకి తన కూతురిని దింపాడు. ఆ క్షణంలో తను కూడా చిన్న పిల్లాడిలా మారిపోయి బీచ్‌లో కూతురితో కలిసి ధోని ఆడుకోవడం అక్కడున్నవారిని ఆశ్చర్యపరిచింది.
ప్రతీ ఒక్కరి జీవితంలో బాల్యం అనేది చాలా మధురంగా ఉంటుంది. ఆ క్రమంలోనే చిన‍్ననాటి జ్ఞాపకాలు అనేవి కూడా మనల్ని అప్పుడప్పుడు తట్టి లేపుతూ ఉంటాయి కూడా. అలా ఇసుకలో ఆడుకున్న ధోని తన చిన్ననాటి జ్ఞాపకాన్ని కూతురితో కలిసి ఇలా నెమరవేసుకున్నాడు. ఇదే విషయాన్ని క్యాప్షన్ రూపంలో చెప్పిన ధోని ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ధోని-జీవాల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment