స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా 4-1 తేడాతో కైవసం చేసుకుంది. సూర్యకుమార్ యాదవ్ టీమిండియా కెప్టెన్‌గా తన తొలి సిరీస్‌లోనే విజయం సాధించి, దిగ్గజ కెప్టెన్ల సరసన చేరాడు. ట్రోఫీ గెలిచిన అనంతరం స్కై భారత కెప్టెన్లు ఆచరించిన ఆనవాయితీని కొనసాగించాడు.
ఇటీవలికాలంలో భారత్ సిరీస్ నెగ్గిన ప్రతిసారి కెప్టెన్లు కొత్త ఆటగాళ్లకు ట్రోఫీని అందించడం ఆనవాయితీగా వస్తుంది. అదే ఆనవాయితీని స్కై కూడా కొనసాగిస్తూ.. జట్టులోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన రింకూ సింగ్, జితేశ్ శర్మలకు ట్రోఫీని అందించాడు. టీమిండియాలో ఈ ఆనవాయితీని మహేంద్ర సింగ్ ధోని 2007లో ప్రవేశపెట్టాడు. నాటి నుంచి భారత్ ట్రోఫీ నెగ్గిన ప్రతిసారి కెప్టెన్ ఎవరైనా ఈ ట్రెడిషన్ కొనసాగుతూనే ఉంది.
Suryakumar Yadav with the T20I series Trophy.
— Johns. (@CricCrazyJohns) December 3, 2023
- A memorable start for Captain SKY. pic.twitter.com/zo3elColpN
ఇదిలా ఉంటే, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాతో నిన్న (డిసెంబర్ 3) జరిగిన నామమాత్రపు ఐదో టీ20లో టీమిండియా 6 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్వల్ప లక్ష్యాన్ని విజయవంతంగా డిఫెండ్ చేసుకుని అద్భుత విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసి 160 పరుగులు చేసిన భారత్.. బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో ఆసీస్‌ను నిలువరించగలిగింది.
Suryakumar Yadav handed over the Trophy to Rinku & Jitesh.
— Johns. (@CricCrazyJohns) December 3, 2023
- A lovely gesture by the leader. pic.twitter.com/gwHdVxZRlA
ఆఖరి ఓవర్లో ఆసీస్ గెలుపుకు 10 పరుగుల చేయాల్సిన తరుణంలో అర్షదీప్ సింగ్ మ్యాజిక్ చేశాడు. 6 బంతుల్లో వికెట్ తీసి కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చి టీమిండియాను గెలిపించాడు. ఈ సిరీస్‌లో ఆసీస్ కేవలం మూడో టీ20లో మాత్రమే విజయం సాధించగా.. భారత్ మిగిలిన మ్యాచ్‌లన్నిటిలో గెలుపొంది సిరీస్ కైవసం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment