రాయ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20లో 20పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 3-1తో భారత్ సొంతం చేసుకుంది. 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లలో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ 3 వికెట్లతో ఆసీస్‌ను దెబ్బతీశాడు. అతడితో పాటు దీపక్ చాహర్ రెండు, బిష్ణోయ్, అవేష్‌ఖాన్ తలా వికెట్ సాధించారు.
ఆస్ట్రేలియా బ్యాటర్లలో కెప్టెన్ మాథ్యూ వేడ్(36) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్‌లో 9 వికెట్ల నష్టానికి 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. టీమిండియా బ్యాటర్లలో రింకూ సింగ్ మరోసారి అదరగొట్టాడు. రింకూ 29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46 పరుగులు చేశాడు.
రింకూతో పాటు జితేష్ శర్మ(35), యశస్వీ జైశ్వాల్(37), రుతురాజ్ గైక్వాడ్(32) పరుగులతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో బెన్ ద్వార్షుయిస్ మూడు వికెట్లతో అదరగొట్టగా.. జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, సంగా తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఇరు జట్ల మధ్య ఆఖరి మ్యాచ్ డిసెంబర్ 3న బెంగళూరు వేదికగా జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment