ధవన్ స్థానంలో రహానె వచ్చాడు.. | Pandey, Rahane may come in for Shikhar, Yuvraj | Sakshi
Sakshi News home page

ధవన్ స్థానంలో రహానె వచ్చాడు..

Published Thu, Mar 31 2016 4:11 PM | Last Updated on Sun, Sep 3 2017 8:57 PM

ధవన్ స్థానంలో రహానె వచ్చాడు..

ధవన్ స్థానంలో రహానె వచ్చాడు..

ముంబై: వెస్టిండీస్తో టి-20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్కు టీమిండియా తుది జట్టులో మార్పులు చేశారు. ఈ మెగా ఈవెంట్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న ఓపెనర్ శిఖర్ ధవన్ను కీలక సెమీస్ పోరుకు పక్కనబెట్టారు. రిజర్వ్ బెంచ్కు పరిమితమైన అజింక్యా రహానెను ధవన్ స్థానంలో ఓపెనర్గా తీసుకున్నారు. ఇక గాయం కారణంగా ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ దూరమవడంతో మనీశ్ పాండేకు తుది జట్టులో చాన్స్ దక్కింది.

టీమిండియా కెప్టెన్ ధోనీ అండ్ కో బస చేసిన హోటల్లో ఈ రోజు సమావేశమై తుది జట్టులో మార్పుల గురించి చర్చించారు. ఈ టోర్నీలో టీమిండియా ఎక్కువగా విరాట్ కోహ్లీపైనే ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. బ్యాటింగ్లో విరాట్కు ధోనీ, యువరాజ్ మాత్రమే అండగా ఉంటున్నారు. ఓపెనర్లు రోహిత్ శర్మ, ధవన్తో పాటు సురేష్ రైనా, హార్దిక్ పాండ్యా కూడా రాణించలేకపోతున్నారు. దీనికితోడు యువరాజ్ గాయంతో దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో భారత్ తుది జట్టులో మార్పులు చేశారు. రహానె, పాండేలకు అవకాశం ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement