
ముంబై: భారత క్రికెటర్ మనీష్ పాండే ఓ ఇంటివాడయ్యాడు. ఈరోజు(సోమవారం) సినీ నటి అశ్రిత శెట్టిని మనీష్ వివాహం చేసుకున్నాడు. వీరి వివాహం ముంబైలోని ఒక హోటల్‌లో జరిగింది. తమ సాంప్రదాయ పద్ధతిలో జరిగిన మనీష్-అశ్రితల పెళ్లికి కుటుంబ సభ్యులతో పాటు కొద్దిమంది క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే హాజరయ్యారు. వీరి వివాహానికి సంబంధించి ఫోటోను ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ తన ట్వీటర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఈ మేరకు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపింది. ఇక అంతా మంచే జరగాలంటూ సన్‌రైజర్స్ పేర్కొంది. ఐపీఎల్‌లో మనీష్ పాండే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
సయ్యద్ ముస్తాక్ అలీ దేశవాళీ టి20 ట్రోఫీని మనీష్ పాండే నేతృత్వంలోని కర్ణాటక జట్టు తాజాగా గెలుచుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో కర్ణాటక జట్టు పరుగు తేడాతో తమిళనాడుపై గెలిచి ట్రోఫీని సొంతం చేసుకుంది. మనీశ్ పాండే (45 బంతుల్లో 60 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు. ఇక ముంబైకి చెందిన అశ్రిత(26) 2012లో తుళు భాషలో నిర్మితమైన ‘తెళికెద బొల్లి’ద్వారా తెరంగేట్రం చేసింది. అనంతరం ఉదయం ఎన్‌హెచ్ 4 ద్వారా తమిళ చిత్రసీమలో అడుగుపెట్టింది. తమిళంలోనే ‘ఒరు కన్నియమ్ మూను కలవానికుళుమ్’, ‘ఇంద్రజిత్’ సినిమాల్లోనూ నటించింది.
Wishing good luck, happiness and lots of love to @im_manishpandey and Ashrita 🥰
— SunRisers Hyderabad (@SunRisers) December 2, 2019
Congratulations!! 🎉🎊#OrangeArmy #ManishPandey #SRHFamily pic.twitter.com/AjdlMOUPQ9
Comments
Please login to add a commentAdd a comment