ఐపీఎల్-11 సీజన్ ఆటగాళ్ల వేలంలో టీమిండియా సీనియర్ క్రికెటర్లకు తీవ్ర నిరాశే ఎదురుకాగా, యువ ఆటగాళ్లు భారీ ప్యాకేజీలు సొంతం చేసుకున్నారు. దీంతో వారిపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుత వేలంలో భారత యువ క్రికెటర్లు మనీశ్ పాండే, కేఎల్ రాహుల్‌లు ఊహించని రీతిలో రూ.11 కోట్ల ధరకు కొనుగోలు అయ్యారు. మనీశ్ పాండే కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ జట్లు రేట్లు పెంచుకుంటూ పోగా పదికోట్ల మార్కు చేరుకున్నాక సన్‌రైజర్స్ హైదరాబాద్ అనూహ్యంగా రేసులోకి వచ్చింది. 11 కోట్ల ధరకు మనీశ్ పాండేను సన్‌రైజర్స్ సొంతం చేసుకుంది.